AP Train Accident Update: విజయనగరం రైలు ప్రమాదంలో 14కు పెరిగిన మృతుల సంఖ్య.. వందల సంఖ్యలో క్షతగాత్రులు.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం

మరో 33 మంది తీవ్రంగా గాయపడ్డినట్టు అధికారులు చెబుతున్నా వారి సంఖ్య వందకుపైనే ఉంటుందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

Andhra Pradesh Train Accident (PIC@ ANI X)

Vijayawada, Oct 30: విజయనగరం (Vizianagaram) జిల్లాలో గతరాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాదంలో (Train Accident) మరణించినవారి సంఖ్య 14కు పెరిగింది. మరో 33 మంది తీవ్రంగా గాయపడ్డినట్టు అధికారులు చెబుతున్నా వారి సంఖ్య వందకుపైనే ఉంటుందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. రెండు ప్యాసింజర్ రైళ్లు (Trains), గూడ్సు రైలులో కలిపి మొత్తం ఏడు బోగీలు ప్రమాదంలో నుజ్జయ్యాయి. రాయగడ రైలులోని దివ్యాంగుల బోగీ పట్టాలు తప్పి పొలాల్లో పడింది. రెండు ప్యాసింజర్ రైళ్లలోనూ కలిపి దాదాపు 1400 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాద తీవ్రతను బట్టి మృతుల సంఖ్య 40 నుంచి 50 వరకు ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. అర్ధరాత్రి వరకు 10 మృతదేహాలను వెలికి తీశారు.

Andhra Pradesh Train Accident: విజయనగరం రైలు ప్రమాదంలో పెరుగుతున్న మృతుల సంఖ్య, ఇప్పటి వరకు ఆరుగురు మృతి, 20 మందికి పైగా గాయాలు, హెల్ప్ లైన్ నంబర్లు ఇవే!

అసలేం జరిగిందంటే?

కంటకాపల్లి-అలమండ మధ్య నిన్న రాత్రి ఏడు గంటల సమయంలో ముందు వెళ్తున్నవిశాఖపట్టణం-పలాస (08532) రైలును వెనక నుంచి వచ్చిన విశాఖ-రాయగఢ (08504) రైలు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో మూడు బోగీలు నుజ్జునుజ్జయ్యాయి. ప్రమాదంలో రాయగడ రైలు బోగీలు నుజ్జయ్యాయి. మరో ట్రాక్‌పై ఉన్న గూడ్సురైలు బోగీలపై దూసుకెళ్లాయి. రైళ్ల ఢీ ఘటనతో ఒక్కసారిగా అక్కడ భీతావహ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రయాణికులు రైలు దిగి భయంతో పరుగులు తీశారు. చిమ్మచీకటిగా ఉండడంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. సిగ్నల్ కోసం వేచివున్నపలాస ప్యాసింజర్ రైలును వెనక నుంచి వేగంగా వచ్చిన రాయగడ రైలు ఢీకొట్టినట్టు ప్రయాణికులు చెబుతున్నారు. ఈ ఏడాది జూన్‌లో జరిగిన బాలేశ్వర్ రైలు ప్రమాద ఘటనను ఇది తలపించింది.

India vs England, World Cup 2023, Viral Video: 40 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్, షమీ వికెట్లు ఎలా తీశాడో ఈ వీడియోల్లో చూడండి..



సంబంధిత వార్తలు