Vijayanagarm, OCT 29: విజయనగరం జిల్లాలో ఆదివారం రాత్రి ఘోర రైలు ప్రమాదం (Andhra Pradesh train accident) జరిగింది. రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. క్షతగాత్రులను అంబులెన్స్‌లలో విజయనగరం (Andhra Pradesh train accident) ఆసుపత్రికి తరలిస్తున్నారు. రైల్వే అధికారుల, ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాత్రి 7.10 గంటల సమయంలో విశాఖ నుంచి పలాస వెళ్తున్న ప్రత్యేక ప్యాసింజర్ రైలు కొత్తవలస మండలం అలమండ-కంటకాపల్లి వద్ద సిగ్నల్ కోసం పట్టాలపై ఆగి ఉంది. అదే సమయంలో దాని వెనకాలే వస్తున్న విశాఖ-రాయగడ రైలు.. ప్యాసింజర్ రైలును ఢీ కొట్టింది. ప్రమాదంపై రైల్వే బోర్డు గ్రూపులో డీఆర్‌ఎం సౌరబ్ ప్రసాద్ సమాచారం ఇచ్చారు. ఎన్డీఆర్‌ఎఫ్, రెవెన్యూ, పోలీసు సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
Andhra Pradesh train accident | Rescue operations are underway, all have been rescued, and teams have been mobilised. PM Modi has reviewed the situation. I spoke to the Andhra Pradesh CM. The situation is currently under control: Railway Minister Ashwini Vaishnaw to ANI
(File… pic.twitter.com/0eweQ6C6cw
— ANI (@ANI) October 29, 2023
ఈ ప్రమాదంలో మూడు బోగీలు పట్టాలు (Andhra Pradesh train accident) తప్పాయి. రైళ్లు ఢీకొనడంతో ఘటనా స్థలంలో విద్యుత్ వైర్లు తెగిపోయాయి. దీంతో ఆ ప్రాంతమంతా అంధకారం నెలకొనడంతో సహాయక చర్యలకు ఆటంకమేర్పడింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. ఘటనా స్థలిలో భీతావహ పరిస్థితి నెలకొంది.
#WATCH | Andhra Pradesh train accident | Visuals of rescue operations
6 people died and 18 injured in the Andhra Pradesh train accident: Deepika, SP, Vizianagaram pic.twitter.com/5iHHzI1UWQ
— ANI (@ANI) October 29, 2023
విజయనగరం జిల్లాలో జరిగిన రైలు ప్రమాద దుర్ఘటన నేపథ్యంలో అధికారులు హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు చేశారు. సమాచారం కోసం.. 0891 2746330, 0891 2744619, 81060 53051, 81060 53052, 85000 41670, 85000 41677, 83003 83004, 85005 85006 నెంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు.
Andhra Pradesh train accident| Ministry of Railway issues helpline numbers https://t.co/foBoTg0FRp pic.twitter.com/8juPU1ZWbl
— ANI (@ANI) October 29, 2023
మంత్రి బొత్స సత్యనారాయణ, విజయనగరం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, ఎస్పీ దీపికా పాటిల్ ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. ప్యాసింజర్ రైలు కావడంతో ప్రయాణికుల వివరాలు తెలుసుకోవడం అధికారులకు కష్టంగా మారింది. కోల్‌కతా-చెన్నై ప్రధాన మార్గంలో రైలు ప్రమాదం జరగడంతో భువనేశ్వర్ వద్ద కొన్ని రైళ్లను నిలిపివేశారు. కోల్‌కతా వైపు రైళ్లను విశాఖ తదితర స్టేషన్లలో నిలిపివేశారు. రైతుల బాధితులకు సహాయం, సమాచారం అందించడం కోసం విజయనగరం కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్టు జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి తెలిపారు. బాధితుల సమాచారం కోసం కలెక్టర్ కార్యాలయంలో 9493589157, రైల్వే కార్యాలయంలో 8978080006 ఫోన్ నంబర్లకు సంప్రదించాలని సూచించారు.