IPL Auction 2025 Live

Weather Forecast: బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం, ఏపీకి రెండు రోజుల పాటు వర్ష సూచన, విజయవాడలో అకస్మాత్తుగా భారీ వర్షం

రానున్న రెండు రోజు­లు ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రల్లో అనేక చోట్ల, రాయలసీమలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.

Rains (Photo-Twitter)

వాయవ్య బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్, ఒడిశా తీరాలకు ఆనుకుని ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా సముద్ర మట్టానిక7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. ఈ అల్పపీడనం రానున్న 24 గంటల్లో ఛత్తీస్‌గఢ్‌ వైపు పయనిస్తుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) బుధవారం నివేదికలో తెలిపింది.

మరోవైపు రుతుపవన ద్రోణి రాజస్తాన్‌లోని జైసల్మేర్‌ నుంచి అల్పపీడన ప్రాంతం వరకు కొనసాగుతోంది. మరోవైపు రాష్ట్రం మీదుగా పశ్చిమ, వాయవ్య గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రానున్న రెండు రోజు­లు ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రల్లో అనేక చోట్ల, రాయలసీమలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.

బెజవాడలో కుండపోత వర్షం, ఉక్కపోత నుంచి రిలాక్స్‌ అయిన నగరవాసులు, ఉరుములు, మెరుపులతో ఒక్కసారిగా దంచికొట్టిన వాన

ఈ రోజు బెజవాడలో భారీ వర్షం (Rain in Vijayawada) పడింది. కుండపోత వాన దంచికొట్టింది. ఉరుములు మెరుపులతో కుంభవృష్టి వర్షం కురిసింది. భారీ వానతో ఒక్కసారిగా బెజవాడలో వెదర్ (Bejawada Weather) మారిపోయింది. వాతావరణం చల్లబడింది. కొన్నాళ్లుగా వాతావరణం ఎండాకాలాన్ని తలపించింది. మండుటెండలతో, తీవ్రమైన ఉక్కపోతతో జనం విలవిలలాడిపోయారు. సెకండ్ సమ్మర్ లా పరిస్థితి తయారైంది. పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోయాయి. ఎండల తీవ్రతతో జనం తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ఇవేం ఎండలు రా నాయనా అని బెంబేలెత్తిపోయారు. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో ఒక్కసారిగా కురిసిన భారీ వానతో వాతావరణం మారిపోయింది. వాతావరణం చల్లగా మారడంతో నగరవాసులు ఊపిరిపీల్చుకున్నారు.



సంబంధిత వార్తలు

Rishabh Pant: రూ. 27 కోట్లతో ఐపీఎల్ వేలం రికార్డులన్నీ బద్దలు కొట్టిన రిషబ్ పంత్, IPL చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన భారత స్టార్ వికెట్ కీపర్

Sambhal Shahi Jama Masjid Survey: యూపీలో మసీదు సర్వే కోసం వచ్చిన అధికారులపై రాళ్లు రువ్విన స్థానికులు, టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు, వీడియోలు ఇవిగో..

Rains in AP: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రేపటికల్లా వాయుగుండంగా మారే అవకాశం.. అల్పపీడనం ప్రభావంతో నేటి నుంచి దక్షిణ కోస్తా, రాయలసీమల్లో వర్షాలు

Heavy Rains in AP: బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం.. వచ్చే వారం ఏపీలో దంచికొట్టనున్న వానలు.. ఐఎండీ అంచనా.. ఉత్తరం నుంచి వీచే గాలుల ప్రభావంతో కోస్తాంధ్రలో పెరగనున్న చలి తీవ్రత