Kadapa Shocker: ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకుంటానన్న కూతురు, తట్టుకోలేక పెట్రోల్‌ పోసి నిప్పంటించిన తల్లిదండ్రులు, కడప జిల్లాలో దారుణ ఘటన, మరో చోట మతి స్థిమితం లేని మహిళను చిత్రహింసలకు గురి చేసిన బంధువులు

ప్రేమ వ్యహారం విషయంలో కూతురిపై పెట్రోల్‌ పోసి తల్లిదండ్రులు (woman ablaze by family) నిప్పంటించారు . ఈ దారుణ సంఘటన రాయచోటిలో మంగళవారం చోటుచేసుకుంది.

Fire (Representational image) Photo Credits: Flickr)

Kadapa, June 16: వైయస్సార్ కడప జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ వ్యహారం విషయంలో కూతురిపై పెట్రోల్‌ పోసి తల్లిదండ్రులు (woman ablaze by family) నిప్పంటించారు . ఈ దారుణ సంఘటన రాయచోటిలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రాయచోటికి చెందిన ఓ యువతి అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడిని (love affair) ప్రేమించింది. ఈ ప్రేమ వ్యవహారం ఇష్టం లేని కుటుంబసభ్యులు ఆమెకు మరో సంబంధం చూసి పెళ్లి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

అయితే వచ్చిన సంబంధాలన్నీ ఆమె చెడగొడుతోంది. దీంతో కొద్దిరోజులుగా కుటుంబసభ్యులతో ఆమెకు గొడవ జరుగుతోంది. ఈ క్రమంలోనే మంగళవారం మరోసారి కుటుంబ సభ్యులు పెళ్లి విషయంపై బలవంతం చేయగా ఆమె నిరాకరించింది. దీంతో ఆగ్రహానికి గురైన తల్లిదండ్రులు, సోదరుడు ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. యువతి కేకలు వేయడంతో ఆమె అక్క, స్థానికులు వచ్చి మంటలు ఆర్పివేశారు. తీవ్రంగా గాయపడిన ఆమెను కడప రిమ్స్ కు తరలించారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

పట్టపగలే పండ్ల వ్యాపారిపై ఆరుగురు యువకులు కాల్పులు, తృటిలో తప్పించుకున్న వ్యాపారి కైలాష్‌ మీనా, రాజస్తాన్ కోట జిల్లా మార్కెట్‌లో ఘటన, బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తెలిపిన పోలీసులు

నెల్లూరులో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. మతిస్థిమితం లేని యువతిని బంధువులే చిత్రహింసలకు గురి చేశారు. ఐసీడీఎస్‌ అధికారుల కథనం మేరకు.. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం యార్లపూడి గ్రామానికి చెందిన పద్మకు చిన్న వయసు నుంచే మతిస్థిమితం లేదు. ఆమె చిన్న తనంలోనే తల్లి మృతి చెందగా, తండ్రి ఎటో వెళ్లిపోయాడు. పద్మ తన మేనమామ గగనం మల్లికార్జున, ప్రసన్న దంపతుల సంరక్షణలో ఉంటుంది.

ఏడాది క్రితం పద్మకు అక్క వరసయ్యే బాలాయపల్లిలో అంగన్‌వాడీ కార్యకర్తగా పనిచేస్తున్న సుమతి, బావ వెంకటయ్య వద్ద మేనమామ వదిలి వెళ్లిపోయాడు. అయితే కొంతకాలం నుంచి పద్మను వారు చిత్రహింసలకు గురి చేసి తీవ్రంగా కొడుతున్నారు. పద్మను ఇంట్లో నిర్బంధించి పైశాచికంగా ప్రవర్తించేవారు. ఈ విషయం వైఎస్సార్‌సీపీ నాయకురాలు రాయి దేవికాచౌదరి దృష్టికి వెళ్లడంతో ఆమె అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఐసీడీఎస్‌ సీడీపీఓ జ్యోతి, ఎస్సై నరసింహారావు, నెల్లూరు దిశ పోలీసులు మంగళవారం పద్మ నివాసం వద్దకు చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. గాయాలతో ఉన్న పద్మను చూసి నివ్వెరపోయారు. వెంటనే ప్రభుత్వ వైద్యశాలలో ప్రథమ చికిత్స చేయించి, పక్కనే ఉన్న సఖి కేంద్రానికి తరలించారు. పద్మకు ప్రభుత్వం నుంచి దివ్యాంగుల పింఛన్‌ వస్తున్న విషయం గమనార్హం.