రాజస్తాన్‌ కోట జిల్లా మార్కెట్‌లో పట్టపగలే బైక్‌పై వచ్చిన దుండగులు తుపాకులతో పండ్ల వ్యాపారి కైలాష్‌ మీనాపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో పండ్ల వ్యాపారి తృటిలో తప్పించుకున్నాడు. దీనికి సంబంధించిన 38 సెకన్ల వీడియో సీసీటీవీ ఫుటేజీలో రికార్డవడంతో వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో ముగ్గురు వ్యక్తులు అక్కడున్న మిగతా షాపుల యజమానులకు వేలు చూపిస్తూ వార్నింగ్‌ ఇస్తుండగా.. ఒక వ్యక్తి మాత్రం తుపాకీతో కాల్పులు జరిపి అక్కడినుంచి పరారయ్యారు.

మీనా ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)