Perni Nani vs Kalyan: కేసీఆర్‌ని తిట్టాలంటే నీ ఫ్యాంట్లో కారిపోతాయి పవన్, నీ వకీల్ సాబ్ సినిమాకి ఏపీలో ఎంత వచ్చిందో తెలుసా, నువ్విచ్చే డబ్బులతో జగన్ ప్రభుత్వం ఏమైనా నడుస్తోందా, పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడిన పేర్ని నాని
తమ ప్రభుత్వం సినీ పరిశ్రమను ఏవిధంగా ఇబ్బంది పెట్టిందో పవన్ కల్యాణ్ చెప్పాలని మంత్రి పేర్ని నాని (YCP Minister Perni Nani) సూటిగా ప్రశ్నించారు.
Amaravati, Sep 26: పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు ఏపీ మంత్రి పేర్ని కౌంటర్ ఇచ్చారు. తమ ప్రభుత్వం సినీ పరిశ్రమను ఏవిధంగా ఇబ్బంది పెట్టిందో పవన్ కల్యాణ్ చెప్పాలని మంత్రి పేర్ని నాని (YCP Minister Perni Nani) సూటిగా ప్రశ్నించారు. ఆదివారం తాడేపల్లిలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు చలన చిత్ర పరిశ్రమను జగన్ కబంధ హస్తాల నుంచి కాపాడటానికి వచ్చిన ధీరోధాత్తుడు పవన్. తెలంగాణ 519 థియేటర్లు ఉంటే 419 మాత్రమే నడుస్తున్నాయి.
మూడు రోజుల క్రితం ఓ సినిమా రిలీజ్ అయ్యింది. ఏపీలో 510 హాళ్లలో 'లవ్ స్టోరీ' సినిమా ఆడుతోంది. ఆ సినిమాకి ప్రొడ్యూసర్‌కి ఏపీలో మొదటి రోజు వచ్చిన షేర్ రూ.3.88 కోట్లు, తెలంగాణలో రూ.3 కోట్లు మాత్రమే. మీరంతా సినీ పరిశ్రమ మేలు కోరే వారైతే పవన్ కల్యాణ్ మాట్లాడిన అవాకులు చెవాకులపై సునీల్ నారాయణ మాట్లాడితే బాగుంటుంది.
సాయిధరమ్ తేజ్ విషయంలో మీడియా తప్పేంటి..? అతనికి మంచి పేరుంది దాన్ని ఎందుకు పాడు చేస్తావు..? తెలంగాణ పోలీస్ ఏమి చెప్పారో మీడియా అదే రాసింది. కోడికత్తి కేసు అంటూ చెప్తున్నాడు. దాన్ని NIA దర్యాప్తు చేస్తోంది. నీకు దమ్ముంటే అమిత్ షాని అడగాల్సింది?. ప్రైవేట్ పెట్టుబడిపై ప్రభుత్వ పెత్తనమా అంటాడు. నీకు ట్యాక్స్ కట్టడమేంటి అని మోదీని, నిర్మలా సీతారామన్‌ని అడగొచ్చుగా..?. జీఎస్టీ విషయంలో నీ నోరు ఏమైంది?. కాపు లక్షణం నమ్ముకున్నోళ్లకి నమ్మకంగా ఉండటం అలానే చంద్రబాబుని నమ్ముకున్నానని నువ్వు చెప్పొచ్చుగా. రెడ్డి అంటూ దిల్ రాజుని అంటే ఆయన నవ్వలేక బిక్కపోయినట్లు ఉంది. వకీల్ సాబ్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో దిల్‌రాజుకి రూ.80 కోట్ల షేర్ వచ్చింది. అందులో రూ.50.65 కోట్లు ఏపీలోనే వచ్చింది. ఇక ఎక్కడ వకీల్ సాబ్ సినిమాని తొక్కేసిందని (Nani Strong Counter To Pawan Kalyan) మండి పడ్డారు.
ప్రభుత్వం దివాళా తీసినందుకే మా డబ్బులతో లోన్ తెచ్చకోడానికి అంటున్నావ్. ఎక్కడున్నాయి నీ డబ్బులు. సీఎం జగన్ ఏటా ప్రజల అకౌంట్లో వేసే డబ్బు రూ. 60 వేల కోట్లు. నువ్విచ్చే డబ్బులతో ఇక్కడ నడుస్తుందా? నీ వకీల్ సాబ్‌కి వచ్చిన రూ.50కోట్లు ఇక్కడ పరిపాలనకు సరిపోతాయా?. చిరంజీవి భార్య చెప్పినట్లు చదువుకోవాల్సింది. ఆన్‌లైన్ టికెట్ సిస్టమ్ కోసం చంద్రబాబు దగ్గర నుంచి జగన్ వరకు ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దలు అనేక అర్జీలు పెట్టారు. 2016లో దామోదర ప్రసాద్ ఆన్‌లైన్ కోసం అర్జీ ఇచ్చారు. 2020 జూన్‌లో నారాయణ్ దాస్‌తో పెద్దలంతా సీఎం జగన్‌కి అర్జీ ఇచ్చారు. మొన్న నాతో జరిగిన మీటింగులో కూడా ఆన్‌లైన్ టికెట్ సిస్టమ్ పెడితే ఆనందంగా ఉంటుందని చెప్పారు. మొన్న జరిగిన సమావేశంలో ఎంతో వయసు పైబడిన వారు కూడా ఇండస్ట్రీ బాగుండాలని తపన పడుతున్నారు.
అసలు ఆన్‌లైన్ టికెట్‌కు పవన్‌కు సంబంధం ఏమిటి?. పవన్ కల్యాణ్ పెద్ద సుత్తి కేసు. రెండు చోట్లా ఓడిపోయినవాడు సన్నాసి కాదా? నేను సన్నాసి అయితే పవన్ సన్నాసిన్నర. స్కూల్, కాలేజీల్లో ఫీజులు నియంత్రిస్తూ మా ప్రభుత్వం జీవో ఇచింది. తెలియకపోతే తెలుసుకో. ఇది ప్రతి ఒక్కరికి ఫ్రెండ్లీ ప్రభుత్వం. ఎవరైతే దోపిడీ చేస్తారో వారికి మాత్రం సింహస్వప్నం. ఇది వర్తమానం సినిమా కాదు, తోలు తీయడం లాంటి మాటలు మానుకో’ అంటూ మండిపడ్డారు.
కాగా ఓ రిపోర్టర్ అందుకుని మిమ్మల్ని పవన్ కల్యాణ్ సన్నాసి అన్నాడు కదా అని ప్రశ్నించారు. దానికి పేర్ని నాని బదులిస్తూ... పవన్ నాయుడు నన్ను సన్నాసి అన్నాడా? అయినా మేం చుట్టాలం, ఒకే కులపోళ్లం, సన్నాసి, దద్దమ్మ అనుకుంటాం, అరే ఓరే అనుకుంటాం, వాడు వీడు అనుకుంటాం అందులో తప్పేమీ లేదులే చౌదరి గారూ, మధ్యలో మీరెందుకు దూరతారు అంటూ సదరు రిపోర్టర్ కు స్పష్టం చేశారు.
"నేను కాపునే. నేను సన్నాసిని అయితే పవన్ కల్యాణ్ గాడు కూడా సన్నాసే అవుతాడు కదా. వాడు పవన్ కల్యాణ్ గాడు సన్నాసిన్నర సన్నాసి. మావాడు తెగ మాట్లాడుతున్నాడు. చుట్టాలం కాబట్టి ఇక దాయడం ఎందుకు" అంటూ పవన్ ను ఏకవచన సంబోధనతో పేర్ని నాని తూర్పారబట్టారు. "వాడు, మేం అంతా ఒకటే, అంతా ఆ తానులో ముక్కలం. ఇవాళ సాయితేజ్ యాక్సిడెంట్ కూడా మా వెధవన్నర వెధవ మాట్లాడాడు. మీడియాదే తప్పు అని మాట్లాడాడు. మీడియాకు బుద్ధి ఉందా అని అడిగాడు. ధైర్యం ఉందా మీడియాను కూడా అడిగాడు. మీడియాను కూడా సన్నాసుల్లారా అన్నాడు.
సాయితేజ్ కు యాక్సిడెంట్ ఘటనలో అసలు గుండెకాయ లేనిది ఎవరికి మీడియాకా, మా పీకే గాడికా? తెలంగాణ పోలీసులు ఏం చెప్పారో నాడు మీడియా కూడా అదే చెప్పింది. దీంట్లో ఎవర్ని తప్పుబట్టాలి? నీకు దమ్ము, ధైర్యం ఉంటే ఈ విషయంలో తెలంగాణ పోలీసులను తిట్టాలి, లేకపోతే సీఎం కేసీఆర్ ను తిట్టాలి. ఏమైపోయాయి నీ దమ్ము, ధైర్యం. అవేవీ నీలో లేవా? లోపలికి వెళ్లిపోయాయా? సీఎం జగన్ మాత్రం నీకు లోకువ అయ్యాడా? కేసీఆర్ ను సన్నాసి, వెధవ, లుచ్ఛా అని తిట్టలేవా? కేసీఆర్ ను తిట్టాలంటే గజగజ వణికిపోతాడని, ప్యాంట్లో కారిపోతాయని అందరికీ తెలుసు. తెరమీద అయితే ఎన్ని డైలాగులు చెప్పినా ఎవరూ ఎదురు పలకరు. రిపబ్లిక్ పార్టీ ఆఫ్ వైఎస్సార్ కాంగ్రెస్ అంటున్నావు... కానీ ఇది రిపబ్లిక్ ఆఫ్ ఇండియా. కాబట్టే నువ్వు ఏది పిచ్చవాగుడు వాగినా చెలామణీ అవుతోంది.
నాన్నా పీకే.. నా మాటలు నువ్వు వింటున్నావని నాకు తెలుసు. ఎందుకంటే నాకు పెద్ద ఫ్యాన్ వని నాకు తెలుసు. నా ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంటువి నువ్వు. వకీల్ సాబ్ సినిమాను ఆపేసుకుని మరీ బందరు వచ్చి నన్ను తిట్టావు. నీ మనసంతా నేను ఉన్నట్టుంది. ఏరా పీకే... శుంఠన్నర శుంఠా... ఏ పాపం తెలియని మీడియాను తప్పుబడతావా? నీకు ఖలేజా ఉంటే తెలంగాణ పోలీసులనో, కేసీఆర్ నో తిట్టుకో. సాయితేజ్ మంచి కుర్రాడు, త్వరగా కోలుకోవాలని సీఎం జగన్ సహా మేమందరం ఆకాంక్షిస్తున్నామని తెలిపారు.