తెలుగు సినీ పరిశ్రమపై ఏపీ ప్రభుత్వ వైఖరిపై సినీ నటుడు, జనసేన అధినేత పనవ్ కల్యాణ్ (Pawan Kalyan) తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ..సినీ పరిశ్రమకు సంబంధించిన విషయాలను ఏపీ సీఎం జగన్ (YS Jagan MohanReddy) దృష్టికి తీసుకెళ్లాలని మోహన్ బాబును కూడా విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలోపవన్ ప్రసంగంపై టాలీవుడ్ (Tollywood)నటుడు మోహన్ బాబు (Mohanbabu) సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
నా ప్రియమైన పవన్ కల్యాణ్ అంటూ ఓ ప్రకటన చేశారు. నా చిరకాల మిత్రుడి సోదరుడైన పవన్ కల్యాణ్ (Pawan Kalyan). నువ్వు నాకంటే చిన్నవాడివి కాబట్టి ఏకవచనంతో సంబోధించాను అని వెల్లడించారు. అయితే పవన్ కల్యాణ్ గారు అనడంలో కూడా తప్పేమీ లేదని పేర్కొన్నారు. చాలాకాలానికి తనను ఈ వ్యవహారంలోకి లాగావు. సంతోషం అంటూ పవన్ ను ఉద్దేశించి మోహన్ బాబు వ్యాఖ్యానించారు. అయితే ప్రస్తుతం ‘మా’ ఎన్నికల కోలాహలం నెలకొని ఉంది, అక్టోబరు 10న ‘మా’ ఎన్నికలు ముగిసిన తర్వాత నువ్వు అడిగిన ప్రతి మాటకు హృదయపూర్వకంగా సమాధానం చెబుతానని మోహన్ బాబు స్పష్టం చేశారు. ఈ లోపు నువ్వు చేయాల్సిన ముఖ్యమైన పని, నీ సోదరుడి లాంటి విష్ణుబాబుకు, అతని టీంకు ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నా. ధన్యవాదాలు’ అని ట్వీట్ సందేశంలో పేర్కొన్నారు మోహన్ బాబు.
Here's Mohan BabuTweet
To My Dear @PawanKalyan pic.twitter.com/xj1azU3v8B
— Mohan Babu M (@themohanbabu) September 26, 2021
సినిమా టికెట్లను ఏపీ ప్రభుత్వం ఆన్ లైన్ ద్వారా విక్రయిస్తుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో జనసేనాధినేత ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. టికెట్ విక్రయం ప్రభుత్వం చేతిలోకి వెళ్తే అది నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్లకు కూడా నష్టం కలిగిస్తుంది కదా.. ఈ విషయం గురించి ఎందుకు ఎవరూ మాట్లాడటం లేదంటూ ప్రశ్నించారు. మన ఇండస్ట్రీపై ప్రభుత్వం పెత్తనం ఏంటి అంటూ పవన్ ప్రశ్నలు సంధించాడు. వైసీపీ తో సత్సంబంధాలు ఉన్న మోహన్ బాబు లాంటి వాళ్లను జగన్‌తో వెళ్లి మాట్లాడండి అంటూ సలహాలు కూడా ఇచ్చాడు పవన్ కళ్యాణ్. లేకపోతే రేపటి రోజు మీ విశ్వవిద్యాలయాన్ని కూడా ప్రభుత్వం చేస్తాడు అంటూ హెచ్చరించాడు.
మీ దాకా వచ్చే వరకు తెచ్చుకోకండి మోహన్ బాబు గారు.. మీరు కూడా ఇండస్ట్రీ నుంచి వచ్చిన వ్యక్తులు అని గుర్తుపెట్టుకోండి అంటూ పవన్ ఓపెన్ కామెంట్స్ చేశాడు. మీరు ఎవరికీ ఊడిగం చేయాల్సిన అవసరం లేదు.. మనం కష్టపడి సంపాదిస్తున్నపుడు ఎవరికీ భయపడాల్సిన పనిలేదు అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఇండస్ట్రీలో చాలా మందిని ఆలోచింపజేస్తున్నాయి. పార్టీలకు అతీతంగా సినిమా ఇండస్ట్రీని కాపాడుకోవాలి అంటే కచ్చితంగా ముందుకు రావాల్సిన సమయం వచ్చింది అని.. ఇప్పుడు కూడా ముందుకు రాకపోతే బానిసత్వం మరి ఎక్కువ అవుతుంది అంటూ పవన్ కళ్యాణ్ చెప్పడంతో ఇది ఎటువైపు దారి తీస్తుందో తెలియక.. ఆసక్తిగా రాబోయే పరిస్థితులను గమనిస్తున్నారు.