YS Jagan Cabinet 2.0: టూరిజం శాఖా మంత్రిగా రోజా, జలవనరుల శాఖ మంత్రిగా అంబటి రాంబాబు, వ్యవసాయ శాఖ మంత్రిగా కాకాణి, ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపులు, పూర్తి వివరాలు ఇవే..

ఆంధ్రప్రదేశ్‌ కొత్త మంత్రులకు శాఖాల కేటాయింపు జరిగింది. సోమవారం ఉదయం మొత్తం 25 మంది మంత్రులుగా (YS Jagan Cabinet 2.0) ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వెంటనే మంత్రులకు శాఖలు (Andhra Pradesh Cabinet Revamped) కేటాయించారు.

YS Jagan Cabinet 2.0 (Photo-Twitter)

Amaravati, April 26: ఆంధ్రప్రదేశ్‌ కొత్త మంత్రులకు శాఖాల కేటాయింపు జరిగింది. సోమవారం ఉదయం మొత్తం 25 మంది మంత్రులుగా (YS Jagan Cabinet 2.0) ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వెంటనే మంత్రులకు శాఖలు (Andhra Pradesh Cabinet Revamped) కేటాయించారు. మొత్తం కేబినెట్‌లో ఐదుగురికి ఉపముఖ్యమంత్రులుగా అవకాశం ఇచ్చారు. కొత్త కేబినెట్‌లో ఐదుగురికి డిప్యూటీ సీఎంలుగా అవకాశం కల్పించారు. రాజన్న దొర, కొట్టు సత్యనారాయణ, బూడి ముత్యాల నాయుడు, ఆంజాద్‌ బాషా, నారాయణ స్వామిలకు ఉప ముఖ్యమంత్రి హోదా కల్పించారు.

సీనియర్‌ నాయకుడు ధర్మాన ప్రసాదరావుకు రెవెన్యూ అండ్‌ స్టాంప్‌లు, సీదిరి అప్పలరాజుకు పశు సంవర్ధక శాఖ,మత్స్యశాఖ, దాడిశెట్టి రాజాకు రోడ్లు, భవనాల శాఖ , గుడివాడ అమర్‌నాథ్‌కు పరిశ్రమలు, ఐటీ శాఖ, వేణుగోపాల్‌కు బీసీ సంక్షేమం, సినిమాటోగ్రపీ, సమాచార పౌర సంబంధాల శాఖను కేటాయించారు. తానేటి వనితకు హోంశాఖకు, జోగి రమేశ్‌కు గృహ నిర్మాణం, కారుమూరి నాగేశ్వరావుకు పౌరసరఫరాలు, మేరుగ నాగార్జునకు సాంఘిక సంక్షేమ శాఖ, విడదల రజనికి వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమం, కొట్టు సత్యనారాయణ శాఖకు దేవదాయశాఖకు, బొత్స సత్యనారాయణకు విద్యాశాఖకు అప్పగించారు. అంజాద్‌ పాషాకు మైనార్టీ సంక్షేమ శాఖ, ఆర్కే రోజాకు టూరిజం, సాంస్కృతిక శాఖ, బుగ్గన రాజేంద్రనాథ్‌కు ఆర్థిక శాఖను కేటాయించారు.

ఎమ్మెల్యే పదవికి సుచరిత రాజీనామా, సీఎం జగన్ వెంటే కొనసాగుతానని వెల్లడి, మాజీ హోం మంత్రి బాటలో పలువురు అసంతృప్త ఎమ్మెల్యేలు

ఉషాశ్రీచరణ్‌కు మహిళా, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, గుమ్మనూరి జయరాంకు కార్మిక శాఖను కేటాయించారు. అంబటి రాంబాబుకు నీటి పారుదల శాఖ, పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డికి విద్యుత్‌ శాఖ, అటవీ పదవులను అప్పగించారు. నారాయణ స్వామికి ఆబ్కారీ, రాజన్నదొరకు గిరిజన వ్యవహారాలు, పినిపే విశ్వరూప్‌ రవాణా శాఖ, ఆదిమూలపు సురేశ్‌కు పురపాలక,అర్బన్‌ డెవలప్‌మెంట్‌ , కాకాణి గోవర్ధన్‌ రెడ్డికి వ్యవసాయ, సహకార శాఖలను కేటాయించారు. బూడి ముత్యాల నాయుడికి పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలను కేటాయించారు.  ఇకపై జగన్‌ గ్యారేజీలో పనిచేస్తాం, అసంతృప్తి జ్వాలలు త్వరలోనే సర్దుకుంటాయి, రాష్ట్ర, పార్టీ భవిష్యత్‌ కోసం సీఎం తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి పనిచేస్తామని తెలిపిన మాజీ మంత్రులు

కొత్త మంత్రుల శాఖాల కేటాయింపు వివరాలు ఇవే

అంబటి రాంబాబు : జలవనరుల శాఖ

ఆంజాద్‌ బాషా : మైనార్టీ సంక్షేమ శాఖ (డిప్యూటీ సీఎం)

ఆదిమూలపు సురేష్ ‌: మున్సిపల్‌ శాఖ, అర్బన్‌ డెవలప్‌మెంట్‌

బొత్స సత్యనారాయణ : విద్యాశాఖ

బూడి ముత్యాల నాయుడు : పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ (డిప్యూటీ సీఎం)

బుగ్గన రాజేంద్రనాథ్‌ : ఆర్థిక, ప్రణాళిక శాఖ, వాణిజ్య పన్నులు, అసెంబ్లీ వ్యవహారాల శాఖ

చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ : బీసీ సంక్షేమ, సినిమాటోగ్రఫీ, ఐ అండ్‌ పీఆర్‌

దాడిశెట్టి రాజా : రోడ్లు, భవనాల శాఖ

ధర్మాన ప్రసాదరావు : రెవెన్యూ రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్స్‌

గుడివాడ అమర్‌నాథ్‌ : పరిశ్రమల శాఖ

గుమ్మనూరు జయరాం : కార్మిక శాఖ

జోగి రమేష్‌ : గృహనిర్మాణ శాఖ

కాకాణి గోవర్థన్‌రెడ్డి : వ్యవసాయం, సహకార, మార్కెటింగ్‌ శాఖ

కారుమూరి వెంకట నాగేశ్వరరావు : పౌర సరఫరాలు, వినియోగదారుల శాఖ

కొట్టు సత్యనారాయణ : దేవాదాయ శాఖ (డిప్యూటీ సీఎం)

నారాయణ స్వామి : ఎక్సైజ్‌ శాఖ (డిప్యూటీ సీఎం)

ఉషాశ్రీ చరణ్‌ : స్త్రీ శిశు సంక్షేమ

మేరుగ నాగార్జున : సాంఘిక సంక్షేమ శాఖ

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి : విద్యుత్‌, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, అటవీ-పర్యావరణ శాఖ

పినిపే విశ్వరూప్‌ : రవాణా శాఖ

రాజన్న దొర : గిరిజన సంక్షేమశాఖ(డిప్యూటీ సీఎం)

ఆర్కే రోజా : టూరిజం, సాంస్కృతిక, యువజన శాఖ

సీదిరి అప్పలరాజు : పశుసంవర్థక, మత్స్య శాఖ

తానేటి వనిత : హోంశాఖ, ప్రకృతి విపత్తుల నివారణ

విడదల రజిని : వైద్యం ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్యవిద్య

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

AP Cabinet Decisions: వచ్చే విద్యాసంవత్సరం నుండి తల్లికి వందనం..రాజధాని అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, పీఎం కిసాన్,అన్నదాత సుఖీభవ.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే

KTR On CM Revanth Reddy: రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీపై ఛీటింగ్ కేసులు పెట్టాలి...జనవరి 21న నల్గొండలో రైతు ధర్నా చేస్తామన్న మాజీ మంత్రి కేటీఆర్, షాబాద్ రైతు దీక్షకు భారీగా తరలివచ్చిన అన్నదాతలు

Hyderabad Double Murder Case: నార్సింగి జంట హత్యల కేసును ఛేదించిన పోలీసులు.. నిందితుడిని మధ్యప్రదేశ్ లో అదుపులోకి తీసుకున్న పోలీసులు

CM Revanth Reddy At Singapore: సింగపూర్‌లో సీఎం రేవంత్ రెడ్డి...గ్రీన్ ఎనర్జీ, టూరిజం, నదుల పునరుజ్జీవనంపై సింగపూర్ విదేశాంగ మంత్రితో చర్చలు

Share Now