
Vjy, April 11: ఏపీలో కొత్త మంత్రి వర్గం కొలువు తీరింది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీరామారావు తరువాత రాష్ట్రంలో ఏపీ సీఎం జగన్ బడుగు, బలహీన, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీలు రాజకీయం, ఆర్థిక, సామాజికంగా ఎదగాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారని తాజా మాజీ మంత్రి కొడాలి నాని ( Kodali Nani) అన్నారు. తమకు క్యాబినేట్ హోదా కోసమో, గౌరవం కోసం పని చేయడం లేదని అన్నారు.
జగన్ వెంట సైనికుల్లా పనిచేస్తామని, రాష్ట్ర, పార్టీ భవిష్యత్ కోసం తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి (Will work under guidance of CM YS Jagan)పేర్కొన్నారు. సీఎం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి ఎప్పుడూ కట్టుబడి ఉన్నామని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. తన ఊపిరి ఉన్నంత వరకు సీఎం జగన్‌తోనే ఉంటానన్నారు. సీఎం జగన్ ఏదైనా మంచి నిర్ణయం తీసుకుంటారని కొడాలి నాని అన్నారు.
పార్టీలో చేరినప్పటి నుంచి తమను అన్ని విధాల సముచిత గౌరవం ఇచ్చారని గుర్తు చేశారు. పార్టీ , రాష్ట్రం కోసం జగన్ గ్యారేజీలో పనిచేస్తామని స్పష్టం చేశారు. తాము ఎప్పుడు పదవుల కోసం పాకులాడలేదని వివరించారు. మంత్రి పదవులు రాకపోవడంతో అనుచరుల్లో కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ త్వరలోనే సర్దుకుంటాయని మరో మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani) తెలిపారు.
తొలి క్యాబినేట్‌లో తమకు చోటు కల్పించడం అదృష్టంగా భావిస్తున్నానని వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సామాజిక న్యాయం చేసి చూపించారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. వందకు వంద శాతం తాను సంతృప్తిగానే ఉన్నానన్నారు. సీఎం జగన్ ఏ పని అప్పజెప్పినా బాధ్యతగా చేస్తానని పేర్ని నాని అన్నారు.