YS Viveka Murder Case: వివేకా హత్య కేసులో మరొకరు అరెస్ట్, పొలం పనులు చూసే జగదీశ్వర్‌రెడ్డి సోదరుడు ఉమా శంకర్‌రెడ్డిని అరెస్ట్ చేసిన సీబీఐ, 14 రోజులపాటు రిమాండ్‌ విధించిన కోర్టు

95వ రోజు కొనసాగిన విచారణలో కడప కేంద్ర కారాగారంలోని గెస్ట్‌హౌస్‌లో సీబీఐ అధికారులు మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి అనుచరుడు, అనుమానితుడు, పులివెందుల కు చెందిన పాలవ్యాపారి గజ్జల ఉమాశంకర్‌ రెడ్డిని, పత్రికా విలేకరి భరత్‌యాదవ్‌ను విచారించి పలు కీలక అంశాలను సేకరించారు.

YS Vivekananda Reddy (Photo-ANI)

Pulivendula, Sep 11: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో (YS Viveka Murder Case) మరో కీలక నిందితుడిని సీబీఐ గురువారం అరెస్టు చేసింది. 95వ రోజు కొనసాగిన విచారణలో కడప కేంద్ర కారాగారంలోని గెస్ట్‌హౌస్‌లో సీబీఐ అధికారులు మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి అనుచరుడు, అనుమానితుడు, పులివెందుల కు చెందిన పాలవ్యాపారి గజ్జల ఉమాశంకర్‌ రెడ్డిని, పత్రికా విలేకరి భరత్‌యాదవ్‌ను విచారించి పలు కీలక అంశాలను సేకరించారు. అనంతరం ఉమాశంకర్‌రెడ్డిని అరెస్టు (Umashankar Reddy Arrested) చేసి కోర్టులో హాజరు పరిచారు. వివేకా పొలం పనులు చూసే జగదీశ్వర్‌రెడ్డి సోదరుడే ఉమా శంకర్‌రెడ్డి అని సీబీఐ అధికారులు వెల్లడించారు.

పులివెందుల మేజిస్ట్రేట్‌ పవన్‌కుమార్‌ అతడికి 14 రోజులపాటు రిమాండ్‌ విధించారు. సీబీఐ అధికారులు ఉమాశంకర్‌రెడ్డిని కడప సెంట్రల్‌ జైలుకు తరలించారు. కాగా, దస్తగిరి స్టేట్‌మెంట్‌ ఆధారంగా మరికొంతమందిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా.. వివేకా హత్యకేసులో ఇప్పటికే సీబీఐ అధికారులు సునీల్‌యాదవ్‌ను రిమాండ్‌కు పంపగా.. వాచ్‌మెన్‌ రంగయ్య, మాజీ డ్రైవర్‌ దస్తగిరితో 164 స్టేట్‌మెంట్‌ కింద వాంగ్మూలాన్ని కోర్టులో రికార్డు చేసిన విషయం విదితమే.

వివేకా హత్య కేసులో సీబీఐ కీలక ప్రకటన, కేసుకు సంబంధించి నమ్మదగిన సమాచారం అందిస్తే రూ.5లక్షలు రివార్డు, వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపిన సీబీఐ అధికారులు

వివేకా హత్యకేసులో సునీల్‌, ఉమాశంకర్‌ పాత్రపై ఆధారాలు ఉన్నాయని సీబీఐ పేర్కొంది. హత్యకేసులో ఇద్దరి కుట్రకోణం ఉందని, ఉమాశంకర్‌ పాత్రపై విచారణలో సునీల్ వెల్లడించారని అన్నారు. ‘వివేకా మాజీ డ్రైవర్‌ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలంలో ఉమాశంకర్‌ పాత్ర ఉందని తెలిపాడు. ఈకేసులో ఇప్పటికే సునీల్‌ యాదవ్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కడప సెంట్రల్ జైలు అతిథి గృహంలో చేపట్టిన విచారణకు ఉమాశంకర్ రెడ్డితోపాటు భరత్‌కుమార్‌ యాదవ్‌ హాజరయ్యారు. భరత్ పులివెందులకు చెందిన సునీల్‌కుమార్‌ యాదవ్‌ బంధువు. భరత్‌కుమార్‌, ఉమాశంకర్‌రెడ్డిని ఇప్పటికే పలుమార్లు సీబీఐ అధికారులు విచారించారు. హత్య కేసులో వీరి నుంచి కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. అలాగే, మరికొంతమంది అనుమానితులను కూడా విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు.., హంతకులు దొరికారంటూ సోషల్ మీడియాలో వార్తలు, అవి నిజం కాదని ఖండించిన పోలీసులు,ఫేక్ ప్రచారం చేస్తే జైలుకే అంటూ హెచ్చరికలు

హత్యకు ఉపయోగించినట్టు భావిస్తున్న ఆయుధాలు, ఇతర కీలక డాక్యుమెంట్లను సీబీఐ గతంలో సీజ్ చేసినట్టుగా ప్రకటించింది. అయితే ఆ తర్వాత ఈ కేసులో హంతకులను పట్టిస్తే నజరానాను ఇస్తామని సీబీఐ ప్రకటించడం చర్చకు దారితీసింది. ఈ కేసులో పలువురు అనుమానితులతో పాటు వివేకానందరెడ్డి సోదరులను కూడ విచారించింది. బుధవారం వివేకానందరెడ్డి సోదరుడు సుధీకర్ రెడ్డిని సీబీఐ విచారించింది. గతవారం కమలాపురం ఎమ్మెల్యే, జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి కూడా విచారించారు.

వైయస్ వివేకా హత్య కేసులో కీలక మలుపు, సునీల్‌ కుమార్‌ యాదవ్‌ను గోవాలో అరెస్ట్ చేసిన సీబీఐ, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కొనసాగుతున్న విచారణ

మరోవైపు..సిట్ బృందాన్ని సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. ఈ విచారణకు సిట్ బృందంలోని సభ్యుడు ఎస్ఐ జీవన్ రెడ్డి హాజరయ్యారు. 2019 మార్చిలో నెలలో ఇంట్లోనే వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసును సీబీఐ టేకప్ చేసింది. కడప కేంద్రంగా అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. ఈ కేసులో పలువురిని అరెస్టు చేశారు.హత్యకు ఉపయోగించిన ఆయుధాలు, కీలక డాక్యుమెంట్లను సీబీఐ సీజ్ చేసినట్లు సమాచారం.

వివేకా హత్య కేసులో కీలక మలుపు, జమ్మలమడుగు మేజిస్ట్రేట్‌ ఎదుట వాంగ్మూలం ఇచ్చిన వాచ్‌మెన్‌ రంగన్న, వివేకా హత్య కేసు దర్యాప్తు చేస్తున్న పర్యవేక్షకాధికారిణి డీఐజీ సుధాసింగ్‌ బదిలీ

కడప (Kadapa) జిల్లా కారాగారం, పులివెందుల ఆర్‌అండ్‌బీ (R&B) అతిథిగృహాల్లో సీబీఐ బృందాలు వేర్వేరుగా అనుమానితులను ప్రశ్నిస్తున్నాయి. కడపలో వివేకా ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి, సుంకేసులకు చెందిన ఉమా శంకర్‌రెడ్డి, సునీల్‌ యాదవ్‌ బంధువు భరత్‌ యాదవ్‌లతో పాటు మరికొంతమందిని ప్రశ్నించి సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు.