YSRCP Central Office Demolished: తాడేపల్లిలో వైసీపీ కార్యాలయం కూల్చివేత.. ప్రొక్లైన్లు, బుల్డోజర్లతో భవనాన్ని కూల్చివేస్తున్న సీఆర్డీఏ అధికారులు

తాడేపల్లిలో శనివారం ఉదయం 5:30 గంటల సమయంలో కూల్చివేతలు ప్రారంభించారు.

YSRCP Central Office demolished (Credits: X)

Vijayawada, June 22: గుంటూరు (Guntur) జిల్లా తాడేపల్లి మండలం సీతానగరంలో  నిర్మాణంలో ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని (YSRCP Central Office) అధికారులు కూల్చివేశారు (Demolished). తాడేపల్లిలో శనివారం ఉదయం 5:30 గంటల సమయంలో కూల్చివేతలు ప్రారంభించారు. ప్రొక్లైన్లు, బుల్డోజర్లతో భవనం కూల్చివేశారు. శ్లాబ్ వేయడానికి సిద్ధంగా ఉన్న భవనాన్ని కోల్చివేశారు. బోట్ యార్డుగా ఉపయోగిస్తున్న స్థలాన్ని తక్కువ లీజుతో వైసీపీ కార్యాలయం కోసం అప్పటి జగన్ సర్కార్‌ కట్టబెట్టిందంటూ సీఆర్డీఏ అధికారులు ఆరోపించారు. ఈ అక్రమ నిర్మాణంపై వైసీపీకి సీఆర్డీఏ నోటీసులు జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టును శుక్రవారం వైసీపీ ఆశ్రయించింది.

గుండెలు ఆగిపోయేలా బ్రిడ్జి నుంచి వేలాడుతూ.. రైలు ఇంజెన్‌ కు రిపేర్ చేసిన లోకోపైలట్లు.. ఉత్తర్‌ ప్రదేశ్‌ లో నర్కటీయా గోరఖ్‌ పూర్ ప్యాసెంజర్ రైల్లో ఘటన

మళ్లీ కోర్టుకు వెళ్తామన్న వైసీపీ

విచారణ జరిపిన న్యాయస్థానం చట్టాన్ని మీరి వ్యవహరించవద్దని ఇరువురికీ సూచించింది. ఈ క్రమంలోనే శనివారం ఉదయం అధికారులు కూల్చివేతలు చేపట్టారు. అయితే, హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ కార్యాలయ భవనాన్ని కూల్చివేశారంటూ వైసీపీ నేతలు నిరసనలకు దిగారు.  కూటమి ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడిందని.. ఈ విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్తామన్నారు.

నీట్, యూజీసీ-నెట్ పరీక్ష పేపర్ లీకుల నేపథ్యంలో అమల్లోకి వచ్చిన పేపర్ లీకుల నిరోధక చట్టం.. నిందితులకు రూ. కోటి వరకూ జరిమానా.. గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్ష