Newdelhi, June 22: మార్గమధ్యంలో ఓ బ్రిడ్జిపై (Bridge) ఓ రైలు అకస్మాత్తుగా ఆగిపోయింది. అయితే, ప్రయాణికులకు ఇబ్బంది కలగకూడదని రైలులోని (Train) ఇద్దరు లోకోపైలట్లు (Locopilots) భావించారు. రైలు ఇంజెన్ కు అత్యంత ప్రమాదకర రీతిలో నిలబడి, వేలాడుతూ రిపేర్లు చేశారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో ఈ ఘటన వెలుగు చూసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నర్కటీయా గోరఖ్ పూర్ ప్యాసెంజర్ రైలు.. శుక్రవారం మార్గమధ్యంలో ఓ రైల్వే బ్రిడ్జిపై అకస్మాత్తుగా ఆగిపోయింది. ఇంజెన్ లో సాంకేతిక సమస్య తలెత్తింది. అయితే, మరమ్మతు చేసేందుకు టెక్నీషియన్లు రావడానికి కొంత సమయం పడుతుందని తెలుసుకొన్న ప్రధాన లోకోపైలట్, అసిస్టెంట్ లోకోపైలట్.. తామే స్వయంగా సమస్యను పరిష్కరించేందుకు నిర్ణయించుకున్నారు.
Watch: Under Engine, Dangling Off Bridge, Loco Pilots Go Extra Mile To Repair Train https://t.co/y6SQ6wTVlN pic.twitter.com/XnBJbj1hsF
— NDTV (@ndtv) June 21, 2024
బ్రిడ్జి మీద నుంచి వేలాడుతూ..
రైలు బ్రిడ్జి మీద ఆగిపోయిందని తెలిసినప్పటికీ.. ప్రయాణికులకు ఇబ్బంది ఉండకూడదని ఈ లోకోపైలట్లు నిర్ణయించారు. ఒకరు రైలు కింద దూరి రిపేర్లు చేయగా మరో లోకోపైలట్ అత్యంత సాహసోపేతంగా బ్రిడ్జి అంచులు పట్టుకుని వేలాడుతున్నట్టుగా నడుస్తూ సమస్య ఉన్న చోటుకు వెళ్లి మరమ్మతు చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.