Attack on YSRCP MLA: పరామర్శకు వెళ్లిన వైసీపీ ఎమ్మెల్యేపై దాడి, పోలీసుల సాయంతో బయటపడ్డ ఎమ్మెల్యే తలారి వెంకట్రావ్, రెండు వర్గాల మధ్య ఆధిపత్యపోరు వల్లనే దాడి జరిగిందని ఆరోపణ

ఈ క్రమంలో గ్రామస్తులు ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై (Talari venkatrao) దాడి చేశారు. దీంతో ఎమ్మెల్యే పోలీసులు భద్రత నడుమ గ్రామ వదిలి వెళ్లిపోయారు.

Eluru, April 30: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా (west godavari) ప్రస్తుత ఏలూరు జిల్లాలోని ద్వారక తిరుమల మండలం జి కొత్తపల్లిలో (G.Kothapalli)తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జి. కొత్తపల్లి వైసీపీ గ్రామ అధ్యక్షుడు గంజి ప్రసాద్ దారుణ హత్యకు గురి అయ్యారు. దీంతో గంజి ప్రసాద్ (Ganji prasad) కుటుంబాన్ని పరామర్శించేందుకు గోపాలపురం వైసీపీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై కొత్తపల్లి వెళ్లారు. ఈ క్రమంలో గ్రామస్తులు ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై (Talari venkatrao) దాడి చేశారు. దీంతో ఎమ్మెల్యే పోలీసులు భద్రత నడుమ గ్రామ వదిలి వెళ్లిపోయారు. ఈ దాడిలో ఎమ్మెల్యేకు గాయాలు అయినట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్యేతో పాటు ఆయన సెక్యూరిటి సిబ్బందిపై కూడా గ్రామస్తులు దాడి చేశారు.

KTR Comments Row: కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ విసిరిన ఏపీ మంత్రి పెద్దిరెడ్డి, రాజకీయ ప్రయోజనాల కోసమే కేటీఆర్ వ్యాఖ్యలు, బొగ్గు అధికంగా కొనేందుకు సిద్ధంగా ఉన్నాం..అమ్ముతారా అంటూ ప్రశ్న

గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై దాడి చేసినవారు (Attack on MLA) వారి సొంత పార్టీ కార్యకర్తలేనని తెలుస్తోంది. జి కొత్తపల్లి‌ వైసీపీలో రెండు వర్గాలు ఉన్నాయని చెబుతున్నారు. అయితే శనివారం ఉదయం వైసీపీ నాయకుడు గంజి ప్రసాద్ దారుణ హత్యకు గురయ్యాడు. హత్యకు గురైన గంజి ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఎమ్మెల్యే వెంకట్రావు (Venkatrao) జి కొత్తపల్లికి వెళ్లారు. అయితే ఎమ్మెల్యేను అక్కడున్న వైసీపీలోని ప్రసాద్ వర్గం అడ్డుకుంది.

Weather Forecast: తెలంగాణను ముంచెత్తిన అకాల వర్షాలు, మరో మూడు రోజుల పాటు కొనసాగే అవకాశం, పలు జిల్లాల్లో తడిసిపోయిన ధాన్యం

ఎమ్మెల్యే మద్దతు ఓ వర్గానికి ఉండటం వల్లే హత్య జరిగిందంటూ ప్రసాద్ వర్గీయులు ఎమ్మెల్యేపై దాడికి దిగినట్లుగా తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఎమ్మెల్యేకు రక్షణ నిలిచారు. ఎమ్మెల్యేను అక్కడి నుంచి ఊరి చివరకు తరలించటంతో ఎమ్మెల్యే అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనలో ఎమ్మెల్యేకు గాయాలు అయ్యాయి. గ్రామంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో అక్కడ పోలీసులు భారీగా మోహరించారు. గంజి ప్రసాద్ వ్యతిరేక వర్గాన్ని ఎమ్మెల్యే ప్రోత్సహిస్తున్నారని.. ఆ వర్గమే ప్రసాద్‌ను హత్య చేయించిందనే ఆరోపణలు వస్తున్నాయి.