Andhra Pradesh Mining Minister Peddireddy Ramachandra Reddy (File Photo/ANI)

Amaravati, April 28: ఆంధ్రప్రదేశ్‌పై తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం (KTR Comments Row) రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో కేటీఆర్‌కు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (peddireddy ramachandra reddy) కౌంటరిచ్చారు. తెలంగాణలో సింగరేణి (singareni) వుంది కాబట్టి వారికి కరెంట్ కోతలు లేవన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారని మంత్రి ఎద్దేవా చేశారు. ఏపీలో విద్యుత్ కోతలు లేవని.. బొగ్గు అధికంగా కొనేందుకు సిద్ధంగా వున్నామని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. ఏపీలో బాగాలేదు.. తెలంగాణలో బాగుందంటే, ఓట్లు పడొచ్చని కేటీఆర్ భావించారేమోనని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. జగన్ సీఎం అయ్యాక రోడ్లు బాగుపడ్డాయని.. ఎన్నికలు దగ్గర వున్నాయి కాబట్టే కేటీఆర్ అలా మాట్లాడారని పెద్దిరెడ్డి ఆరోపించారు. హైద‌రాబాద్‌లో క‌రెంట్ లేక జ‌న‌రేట‌ర్ మీద ఉన్నా..ఇది నేనెవ‌రితోనూ చెప్ప‌లేదే, కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ విసిరిన మంత్రి బొత్సా, ప‌క్క రాష్ట్రాల‌ను విమ‌ర్శించ‌డం మానుకోవాలని హితవు

శుక్రవారం Hyderabadలో జరిగిన క్రెడాయి 11వ వార్షికోత్సవంలో కేటీఆర్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో Roads ధ్వంసమయ్యాయని చెప్పారు. Electricity , Drinking Water కూడా లేవని తనకు కొందరు మిత్రులు చెప్పారన్నారు. అనుమానం ఉంటే ఎవరైనా పక్క రాష్ట్రానికి కార్లేసుకొని వెళ్లి రావాలని కేటీఆర్ సూచించారు. పక్క రాష్ట్రానికి పోయి వచ్చిన తర్వాతే మన రాష్ట్రంలో పరిస్థితులు ఎంత బాగున్నాయో తెలుస్తుందని కేటీఆర్ చెప్పారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలోనే రోడ్లు, మౌళిక సదుపాయాల కల్పన అద్భుతంగా ఉందన్నారు. నేను చెప్పేది అతిశయోక్తి కాదన్నారు.