YSRCP Plenary 2022: 3వ తరగతి నుంచే ప్రతి సబ్జెక్టుకూ టీచర్‌, విద్యా రంగంలో సంస్కరణలకు రూ.52,676.98 కోట్ల వ్యయం, విద్యారంగంపై మంత్రి బొత్స తీర్మానం, సభ ఆమోదం

Minister Botsa Satyanarayana (Photo-Video Grab)

Guntur, Julu 9: వైఎస్సార్సీపీ రెండవ రోజు ప్లీనరీ కొనసాగుతోంది. శుక్రవారం జరిగిన వైఎస్సార్‌సీపీ ప్లీనరీలో (YSRCP Plenary) విద్యారంగంపై మంత్రి బొత్స తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంపై చర్చించిన అనంతరం సభ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ.. విద్య మీద ప్రభుత్వం పెట్టే ఖర్చును దేశాభివృద్ధికి పెట్టుబడిగా చూస్తున్నామన్నారు. మంచి చదువులతో పిల్లలను తీర్చిదిద్దినప్పుడే రాష్ట్రం, దేశం అభివృద్ధి సాధిస్తాయని నమ్మి సీఎం వైఎస్‌ జగన్‌ విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. విద్యా రంగంలో ప్రభుత్వం తెచ్చిన సంస్కరణలు, ఇతర కార్యక్రమాలతో రాష్ట్రంలోని ప్రతి విద్యార్థి భవిష్యత్తు బంగారుమయం కానుందని చెప్పారు.

సీఎం వైఎస్‌ జగన్‌ (CM YS Jagan) నేతృత్వంలో వేల కోట్ల రూపాయలు విద్యా రంగానికి ఖర్చు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి విద్యార్థి ప్రపంచ దేశాలతో పోటీ పడేలా చదువులు కొనసాగించాలని సీఎం విద్యా సంస్కరణలను యజ్ఞంలా కొనసాగిస్తున్నారని గుర్తు చేశారు. విద్యా సంస్కరణలను ప్రతిపక్షాలు హేళన చేయడంపై మంత్రి మండిపడ్డారు. చంద్రబాబు, అవగాహన లేని నేతలే విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు.

వైసీపీ ప్రాథమిక సభ్యుడైన తరువాతే ఎమ్మెల్యే, స్పీకర్‌ అయ్యాను, స్పీకర్‌ తమ్మినేని సీతారాం ప్రకటన, రెండో రోజు జోరుగా వైసీపీ ప్లీనరీ సమావేశాలు..

విద్యారంగంపై తీర్మానం హైలైట్స్‌

3వ తరగతి నుంచే ప్రతి సబ్జెక్టుకూ టీచర్‌

విద్యా రంగంలో సంస్కరణలకు రూ.52,676.98 కోట్ల వ్యయం

విద్యపై పెట్టే ఖర్చు దేశాభివృద్ధికి పెట్టుబడి రాష్ట్రంలో ప్రతి విద్యార్థి ప్రపంచ దేశాలతో పోటీ పడేలా చదువులు

ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా విద్యా రంగంలో సంస్కరణలు

అమ్మ ఒడి జగనన్న మూడో పుత్రిక

ఇంగ్లిష్‌ మీడియం విద్య..

మా హక్కు అనేది ప్రతి విద్యార్థి భావన

రాష్ట్ర విద్యార్థులు ఏ రాష్ట్రం, ఏ దేశం వెళ్లినా గర్వంగా తలెత్తుకొని తిరిగేటట్టు తీర్చిదిద్దాలనేది ప్రభుత్వ సంకల్పం

ఒక విద్యార్థికి మంచి చదువు లభిస్తే ఆ కుటుంబ ఆర్థిక స్థితిగతులు మారిపోతాయి.

మనం పిల్లలకు ఇచ్చే ఆస్తి చదువు మాత్రమే

ప్రైవేటు వర్సిటీల్లోనూ పేదలకు 35 శాతం సీట్లు

గత ప్రభుత్వాల హయాంలో ప్రైవేటు స్కూళ్లకు, కళాశాలలకు ప్రోత్సాహం

కార్పొరేట్‌కు అనుగుణంగానే గత ప్రభుత్వం చట్టాలు

పేదల పిల్లలు బాగుపడటం జీర్ణించుకోలేకే ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా గగ్గోలు

అమ్మ ఒడి, విద్యా కానుక, గోరుముద్ద వంటివాటితో చదువులకు ఊతం

కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా సకల వసతులతో ప్రభుత్వ పాఠశాలలు