Tirumala Srivari Laddu: హైదరాబాద్‌ లో ఉండి కూడా తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని రుచి చూడొచ్చు.. ఇకపై నగరంలో ప్రతి రోజూ లడ్డూ ప్రసాదం విక్రయాలు.. కీలక ప్రకటన చేసిన టీటీడీ

తిరుపతికి వెళ్లిన ప్రతీ ఒక్కరూ ఈ లడ్డును కచ్చితంగా తీసుకోకుండా ఉండలేరు.

Tirumala Srivari Laddu (Credits: X)

Hyderabad, Sep 8: ఆపద మొక్కులవాడు, కోరిన కోర్కెలు తీర్చేవాడు, కలియుగ ప్రత్యక్ష దైవం ఆ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం (Tirumala Srivari Laddu) రుచికి సాటి మరొకటి రాదు. తిరుపతికి వెళ్లిన ప్రతీ ఒక్కరూ ఈ లడ్డును (Srivari Laddu) కచ్చితంగా తీసుకోకుండా ఉండలేరు. అయితే, తమ ఊళ్ళల్లో కూడా ప్రతి రోజూ ఈ లడ్డు అందుబాటులో ఉంటే బావుంటుందని హైదరాబాద్‌ వాసులు అనుకోని రోజులేదు. అలాంటి హైదరాబాదీ భక్తులకు ఓ పెద్ద గుడ్‌ న్యూస్. శ్రీ వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదం ఇకపై ప్రతి రోజూ నగరంలో అందుబాటులో ఉండనుంది. ఈ మేరకు టీటీడీ ఒక ప్రకటనలో వెల్లడించింది.

వెదురు బొంగుతో వినాయకుడు, తయారు చేసిన ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డు గ్రహీత, పర్యావరణాన్ని కాపాడాలని పిలుపు

ఎక్కడ దొరుకుతుంది??

నగరంలోని హిమాయత్‌ నగర్‌ లిబర్టీ, జూబ్లి హిల్స్‌ లోని టీటీడీ దేవస్థానాల్లో ప్రతి రోజూ ఈ శ్రీనివాసుడి లడ్డూను విక్రయించనున్నారు. రూ.50కి ఒక లడ్డూ చొప్పున భక్తులకు ప్రసాదం విక్రయించనున్నారు. ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆలయాల్లో లడ్డూ విక్రయాలు జరుగుతాయని నిర్వాహకులు వివరించారు.

పొలంలో వినాయకుడి చిత్రం, అద్భుతమంటూ నెటిజన్ల ప్రశంసలు..వీడియో ఇదిగో