Taraka Ratna No More: హైదరాబాద్ చేరుకున్న తారకరత్న పార్దీవదేహం.. ప్రముఖుల సంతాపం.. భౌతిక కాయాన్ని చూడటానికి క్యూకట్టిన అభిమానులు, రేపు అంత్యక్రియలు.. వీడియోతో

తారకరత్న భౌతిక కాయం బెంగళూరు నుంచి ఈ ఉదయం రంగారెడ్డి జిల్లా మోకిల గ్రామంలో ఆయన నివాసానికి చేరుకున్నది.

Credits: Twitter

Hyderabad, Feb 19: తెలుగు సినీ నటుడు నందమూరి తారకరత్న (Nandamuri Tarakaratna) గత నెల 27న తీవ్ర గుండెపోటుకు (Heart Attack) గురై, గత 23 రోజులుగా చికిత్స పొందుతూ శనివారం కన్నుమూశారు. తారకరత్న భౌతిక కాయం బెంగళూరు నుంచి ఈ  ఉదయం రంగారెడ్డి జిల్లా మోకిల గ్రామంలో ఆయన నివాసానికి చేరుకున్నది. సోమవారం ఉదయం ఆయన భౌతిక కాయాన్ని ఫిలించాంబర్‌కు (Film Chamber) తరలిస్తారు.

నందమూరి తారకరత్న కన్నుమూత, 23 రోజుల పాటూ మృత్యువుతో పోరాటం, రేపు హైదరాబాద్ కు తారకరత్న భౌతికకాయం

అభిమానుల సందర్శనార్థం అక్కడ ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉంచుతారు. ఐదు గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఈ మేరకు ఆయన కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. తారకరత్న మృతితో టాలీవుడ్, తెలుగు రాజకీయాల్లో విషాదం అలముకుంది. ప్రముఖ సినీ నటులు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, బాలకృష్ణ సహా పలువురు అగ్ర నేతలు, సీఎం కేసీఆర్, చంద్రబాబు, సీఎం జగన్ సహా పలువురు రాజకీయ నేతలు తారకరత్న మృతిపై సంతాపం తెలిపారు.

అత్యంత విషమంగా తారకరత్న ఆరోగ్యం, ఆస్పత్రిలోనే బాలకృష్ణ, ఆందోళనలో అభిమానులు ఎయిర్ అంబులెన్స్‌ లో హైదరాబాద్ కు తరలించే అవకాశం