Taraka Ratna Hospitalised (Photo Credits: Instagram, ANI)

Bangalore, FEB 18: సినీ నటుడు నందమూరి తారకతరత్న (Taraka ratna) కన్నుమూశారు. బెంగళూరులోని నారాయణ హృదయాలయలో 23 రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన…పరిస్థితి విషమించడంతో మరణించారు (Taraka ratna Death). కుప్పంలో లోకేశ్ యాత్రలో గుండెపోటుతో కుప్పకూలిన ఆయన్ను….మెరుగైన చికిత్స కోసం బెంగళూరు తరలించారు. అక్కడ నిపుణుల బృందం ఆయనకు ట్రీట్ మెంట్ చేసినప్పటికీ….ఫలితం కనిపించలేదు. ఈ ఉదయం తారకరత్న ఆరోగ్యం విషమించడంతో…నందమూరి బాలకృష్ణ (Balakrishna) సహా కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకున్నారు. తారక రత్న భౌతికకాయాన్ని హైదరాబాద్ కు తీసుకురానున్నారు.

Taraka Ratna Latest Health Update: అత్యంత విషమంగా తారకరత్న ఆరోగ్యం, ఆస్పత్రిలోనే బాలకృష్ణ, ఆందోళనలో అభిమానులు ఎయిర్ అంబులెన్స్‌ లో హైదరాబాద్ కు తరలించే అవకాశం 

కుప్పంలో నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం యాత్రలో తార‌క‌ర‌త్న గుండెపోటుతో కుప్పకూలిన విష‌యం తెలిసిందే. యాత్ర ప్రారంభమైన కాసేపటికి సమీపంలో ఉన్న మసీదులోకి నారా లోకేశ్‌ వెళ్లారు. లోకేశ్‌తో పాటు తారకరత్న కూడా మసీదులోకి వెళ్లారు. ఆ సమయంలో టీడీపీ కార్యకర్తలు అంతా గుంపుగా తరలివచ్చారు. అందరూ ఒక్కసారిగా మీద పడ్డట్టు రావడంతో తారకరత్నకు ఊపిరి ఆడలేదు. ఇదే విషయాన్ని సిబ్బందికి చెప్పడంతో వాళ్లు.. టీడీపీ కార్యకర్తలను దూరంగా వెళ్లాలని సూచించారు. అయినప్పటికీ వాళ్లు వినిపించుకోలేదు. ఈ క్రమంలో ఊపిరాడక తారకరత్న సొమ్మసిల్లి పడిపోయాడు. వెంటనే ఆయనకు ప్రాథమిక చికిత్స అందించి కుప్పం ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు తీవ్ర గుండెపోటుగా నిర్ధారించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రత్యేక అంబులెన్స్‌ ద్వారా బెంగళూరులోని నారాయణ హృదయాలయకు తరలించి చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆయన మృతిచెందినట్లు డాక్టర్లు ప్రకటించారు.