Telangana Assembly Session: నేడు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.. కేసీఆర్ కు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఫోన్.. సమావేశానికి రావాలని ఆహ్వానం
ఈ నెల 26న తుది శ్వాస విడిచిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు నివాళులర్పించనున్నది.
Hyderabad, Dec 30: తెలంగాణ శాసనసభ సోమవారం (నేడు) (Telangana Assembly Session) ప్రత్యేకంగా సమావేశం కానున్నది. ఇటీవల తుది శ్వాస విడిచిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (Manmohan Singh) కు నివాళులర్పించనున్నది. ఈ మేరకు ప్రభుత్వం రెండు రోజుల క్రితమే అసెంబ్లీ ప్రత్యేక సమావేశంపై నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానున్నది. ఈ నేపథ్యంలో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ (KCR) కు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఫోన్ చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాపాన్ని తెలుపుతూ అసెంబ్లీలో సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు ఆయనకు సమాచారం ఇచ్చారు. సమావేశాలకు రావాల్సిందిగా కోరారు. ఈ మేరకు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే, సమావేశాలకు కేసీఆర్ రావడం లేదని సమాచారం.
ఆర్ధిక మార్గదర్శి
ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న దేశాన్ని తన మేథస్సుతో గట్టెక్కించడమే కాకుండా పదేండ్లు ప్రధానిగా మన్మోహన్ సింగ్ ఎన్నో చిరస్మరణీయ పథకాలను అమలు చేశారు. ఈ నెల 26న ఆయన కన్నుమూసిన సంగతి తెలిసిందే. దేశాన్ని నవ్యపథంలో నిలిపిన సింగ్ కు తెలంగాణ ప్రజాప్రతినిధులు నివాళి అర్పించనున్నారు. సభ నేటి ఉదయం 10గంటలకు ప్రారంభం కానుండగా, సభ్యులంతా మన్మోహన్ సింగ్ దేశానికి చేసిన సేవల్ని స్మరించుకోవడంతోపాటు నివాళులర్పించనున్నారు. అనంతరం సభ నిరవధికంగా వాయిదా పడనున్నది.
2025 తెలంగాణ ప్రభుత్వ సెలవులివే, అక్టోబర్ 3న దసరా..20న దీపావళి, పూర్తి వివరాలివే