Balkampet Yellamma Kalyanam: బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం నేడే.. ఉదయం 11.34 గంటలకు అంగరంగ వైభోగంగా వేడుక

ఉదయం 11.34 నిమిషాలకు ముఖ నక్షత్రయుక్త అభిజిత్‌ లగ్న సుముహూర్తమున కల్యాణాన్ని వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు దేవాలయ ఈవో కె.అంజనీదేవి తెలిపారు.

Balkampet Yellamma Kalynam (Photo-Video Grab)

Hyderabad, July 9: తెలంగాణ (Telangana) రాష్ట్రంలో మహిమాన్విత క్షేత్రంగా బాసిల్లుతున్న హైదరాబాద్ (Hyderabad) లోని బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణం (Balkampet Yellamma Kalyanam) మంగళవారం జరుగనుంది. ఉదయం 11.34 నిమిషాలకు ముఖ నక్షత్రయుక్త అభిజిత్‌ లగ్న సుముహూర్తమున కల్యాణాన్ని వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు దేవాలయ ఈవో కె.అంజనీదేవి తెలిపారు. లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు క్యూ లైన్లలో ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. కాగా సోమవారం నుంచి ప్రారంభమైన ఈ వేడుకలు మూడు రోజుల పాటు జరుగుతాయి. సోమవారం ఉదయం గణపతి పూజతో కల్యాణోత్సవ కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సాయంత్రం అమ్మవారికి ఎదుర్కోళ్లు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు మహాశాంతి చండీ హోమం, సాయంత్రం ఆరు గంటలకు ఎల్లమ్మ అమ్మవారిని రథంపై పురవీధుల్లో ఊరేగిస్తారు.

బిగ్ అలర్ట్, తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు నుంచి 3 రోజుల పాటు భారీ వర్షాలు, 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం

భూమికి 10 అడుగుల దిగువన..

భక్తుల ఆరాధ్య దేవతగా వెలుగొందుతున్న బల్కంపేట ఎల్లమ్మ మూలవిరాట్టు అమ్మవారు విగ్రహం భూమి ఉపరితలానికి 10 అడుగుల దిగువన నిద్రిస్తున్న రూపంలో స్వయంభువుగా వెలసింది. ఈ ఆలయంలో అమ్మవారి మూల విగ్రహం వెనుక భాగం నుంచి నిత్యం నీటి ఊటలు ఉంటాయి. ఎటువంటి కాలంలో అయినా ఈ నీటి ఊటలు సంభవిస్తుంటాయి. చారిత్రక ఆధారాల ప్రకారం, దాదాపు 700 సంవత్సరాలకు పూర్వమే ఇక్కడ అమ్మవారు వెలసినట్టు చెబుతారు. అప్పటినుంచి ఏటా కళ్యాణం జరుగుతున్నది.

రూ. 30 లక్షలు ఇస్తామని ఆశచూపి కిడ్నీ కొట్టేసిన ముఠా.. చివరకు రూ. లక్ష చేతిలో పెట్టి బెదిరింపులు.. విజయవాడలో భారీ మోసం