Apex Council Meeting: జల వివాదం, ఆగస్టు 5న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ, అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేసిన కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్
రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో (Telugu States CMs) అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని (Apex Council Meeting) నిర్వహించేందుకు ముహూర్తం ఖరారైంది. వచ్చేనెల ఐదున వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర జల్‌శక్తిశాఖ కార్యదర్శి యూపీ సింగ్ (water resources secretary UP Singh) బుధవారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు.
Hyderabad, July 30: తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో (Telugu States CMs) అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని (Apex Council Meeting) నిర్వహించేందుకు ముహూర్తం ఖరారైంది. వచ్చేనెల ఐదున వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర జల్‌శక్తిశాఖ కార్యదర్శి యూపీ సింగ్ (water resources secretary UP Singh) బుధవారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. ప్రాణ హాని ఉందని కేంద్రానికి ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖ, ప్రపంచ పులుల దినోత్సవం సంధర్భంగా అటవీ శాఖ అధికారులకు సీఎం జగన్ అభినందనలు, మరిన్ని వార్తా విశేషాలు లోపల కథనంలో..
కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జలశక్తి సమావేశం జరుగనుంది. ఈ సమావేశాన్ని అపెక్స్ కౌన్సిల్ చైర్మన్, కేంద్ర జల్‌శక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ (minister of Jal Shakti Gajendra Singh Shakatwat) నిర్ణయించారని, 5న సీఎంలు అందుబాటులో ఉంటారా లేదా అన్నది సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.
ఏపీ చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపునకు సంబంధించి కృష్ణా బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. రెండు రాష్ట్రాలు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నా.. అపెక్స్ కౌన్సిల్ భేటీ ఏర్పాటుచేయాల్సిందిగా ఎలాంటి ప్రతిపాదనలను నదీయాజమాన్య బోర్డులు, కేంద్రానికి పంపలేదు. గతంలో కేంద్ర జల్‌శక్తి ఈ భేటీకి సంబంధించి ఎజెండా అంశాలు కోరినప్పటికీ రెండు రాష్ట్రాలు పంపలేదు. రూ.59కే కరోనా యాంటీ డ్రగ్ ట్యాబ్లెట్, ఫావిపిరవిర్‌ను మార్కెట్లోకి విడుదల చేసిన హెటిరో
అయినా, ఎజెండాతోపాటు తేదీని ఖరారు చేయడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. 2016 ఆగస్టులో సీఎం కేసీఆర్, అప్పటి ఏపీ సీఎం చంద్రబాబుతో నాటి కేంద్రమంత్రి ఉమాభారతి నేతృత్వంలో అపెక్స్ కమిటీ సమావేశం జరగ్గా ఇది రెండోసారి. కేంద్ర లేఖపై రెండు రాష్ట్రల ముఖ్యమంత్రులు కూడా సుముఖత ఉన్నట్లు సమాచారం.
అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి కేంద్ర జల్‌శక్తి నాలుగు అంశాలతో అజెండా రూపొందించింది. 1.కృష్ణాబోర్డు, గోదావరి బోర్డు పరిధులను నిర్ణయించడం, 2. అపెక్స్ కౌన్సిల్ పరిశీలన, ఆమోదం కోసం కృష్ణా, గోదావరి బోర్డులకు కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లను అందజేయడం, 3. కృష్ణా, గోదావరి నదీ జలాలను రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పంపిణీ చేసేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటుచేయడం, 4. కృష్ణా నదీ బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్‌కు తరలించడం వంటి అంశాలపై ప్రధానంగా చర్చ జరుగనుంది. ఈ సందర్భంగా డీపీఆర్ ఇవ్వడంపైనే ప్రధానంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది.