Bike Stolen From Police Station: ఇదేందయ్యా ఇది.. నేనెక్కడా చూడలే.. పోలీస్ స్టేషన్ నుంచే బైక్ కొట్టేశాడా? కేపీహెచ్ బీ ప్రాంతంలో బైక్ చోరీ.. డ్రంకెన్ డ్రైవ్ లో దొరికిన దొంగ.. పోలీస్ స్టేషన్ లో ఉంచిన బైక్ ను మళ్లీ ఎత్తుకెళ్లిన దుండగుడు
ఈ ఘటన హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
Hyderabad, Nov 20: హైదరాబాద్ (Hyderabad) మాదాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ (Traffic Police Station) నుంచి వాహనం చోరీ కావడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే ఒక వ్యక్తికి సంబంధించిన బైక్ (Bike) ఇటీవల కేపీహెచ్ బీ (KPHB) పరిధిలో చోరీకి గురైంది. దీంతో వాహన యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో మొన్న రాత్రి మాదాపూర్ లో పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ (Drunken Drive) తనిఖీలను నిర్వహిస్తుండగా బైక్ తో సహా దొంగ పట్టుబడ్డాడు. దీంతో వాహనాన్ని జప్తు చేసిన పోలీసులు దాన్ని మాదాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే ఎవరూ లేని సమయాన్ని చూసుకుని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి దుండగుడు బైక్ ను దొంగిలించి పారిపోయాడు.
మరోవైపు చోరీ విషయం గురించి తెలియని పోలీసులు వాహన యజమానికి ఫోన్ చేసి మాదాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు రావాల్సిందిగా కోరారు. ఆయన అక్కడకు వెళ్లి చూసే సరికి బైక్ లేదు. దీంతో ఆయనతో పాటు, పోలీసులు సైతం షాక్ కు గురయ్యారు.