Palamuru-Rangareddy Project: నేడే పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభం.. 12.30 లక్షల ఎకరాలకు సాగు, తాగునీటిని అందించాలనే లక్ష్యంతో ప్రాజెక్టు రూపకల్పన

తెలంగాణ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నీటి ఎత్తిపోతలను సీఎం కేసీఆర్‌ శనివారం ప్రారంభించనున్నారు.

Credits: X

Hyderabad, Sep 16: తెలంగాణ సర్కారు (Telangana Government) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో (Palamuru-Rangareddy Project) భాగంగా నీటి ఎత్తిపోతలను సీఎం కేసీఆర్‌ (CM KCR) శనివారం ప్రారంభించనున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాతోపాటు రంగారెడ్డి జిల్లాలోని 12.30 లక్షల ఎకరాలకు సాగు, తాగునీటిని అందించాలనే లక్ష్యంతో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాని (పీఆర్‌ఎల్‌ఐఎస్‌)కి రూ.35 వేల కోట్ల అంచనా వ్యయంతో 2015లో తెలంగాణ సర్కారు శ్రీకారం చుట్టింది. మొదటి దశలో తాగునీరు, రెండో దశలో సాగునీటికి సంబంధించిన పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకొన్నది. అందులో భాగంగా ఇప్పటికే మొదటి దశలో చేపట్టిన తాగునీటి సరఫరాకు సంబంధించిన పనులను నాగర్‌కర్నూల్‌ జిల్లా శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌ నుంచి మొత్తంగా 21 ప్యాకేజీలుగా విభజించగా.. కేపీ లక్ష్మీదేవిపల్లి మినహా ప్రస్తుతం 18 ప్యాకేజీల పనులను మాత్రమే ప్రభుత్వం చేపట్టింది. ప్రస్తుతం ఆయా ప్యాకేజీల పనులన్నీ దాదాపు తుదిదశకు చేరుకొన్నాయి.

SIIMA Awards 2023: సైమా అవార్డ్స్‌ 2023 ఉత్తమ నటుడు ఎన్టీఆర్‌.. ఉత్తమ నటిగా శ్రీలీల.. ఉత్తమ చిత్రం 'సీతారామం'.. విజేతల పూర్తి వివరాలు ఇవిగో!

ఈ ప్రాంతాలకు ప్రయోజనం

ఇక ప్రాజెక్టు ద్వారా నాగర్‌కర్నూల్‌, మహబూబ్‌నగర్‌, కొడంగల్‌, నారాయణపేట, మక్తల్‌, దేవరకద్ర, జడ్చర్ల, కల్వకుర్తి, అచ్చంపేట, పరిగి, వికారాబాద్‌, తాండూర్‌, చేవెళ్ల, షాద్‌నగర్‌, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, రాజేంద్రనగర్‌, దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల్లోని 70 మండలాల్లో 1,226 గ్రామాలకు తాగు, సాగునీరు అందనున్నది. ప్రాజెక్టు నీళ్లతో 1,546 నీటికుంటలు, చెరువులను నింపనున్నారు.

Hyderabad: కాంగ్రెస్‌లోకి తుమ్మల ఎంట్రీకి ముహుర్తం ఫిక్స్, సోనియా సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు రెడీ అయిన మాజీ మంత్రి, స్వయంగా ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ ముఖ్యనేతలు



సంబంధిత వార్తలు