CM KCR Yadadri Tour: యాదాద్రికి 13 సారి సీఎం కేసీఆర్, లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న తెలంగాణ సీఎం, తుది దశకు చేరుకున్న ఆలయ నిర్మాణ పనులు

పూర్ణ కుంభంతో ఆలయ అర్చకులు, అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేసీఆర్ లక్ష్మీనరసింహ స్వామిని (Yadadri Lakshmi Narasimha Swamy Temple)దర్శించుకుని ప్రత్రేక పూజలు నిర్వహించారు. అర్చకులు ముఖ్యమంత్రికి తీర్థం అందజేశారు. అనంతరం కేసీఆర్ ఆలయ అభివృద్ధి పనులను పరిశీలిస్తున్నారు.

Telangana CM KCR | File Photo

Hyderabad, Sep 13: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ యాదాద్రి టూర్ లో (CM KCR Yadadri Tour) భాగంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేరుకున్నారు. పూర్ణ కుంభంతో ఆలయ అర్చకులు, అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేసీఆర్ లక్ష్మీనరసింహ స్వామిని (Yadadri Lakshmi Narasimha Swamy Temple)దర్శించుకుని ప్రత్రేక పూజలు నిర్వహించారు. అర్చకులు ముఖ్యమంత్రికి తీర్థం అందజేశారు. అనంతరం కేసీఆర్ ఆలయ అభివృద్ధి పనులను పరిశీలిస్తున్నారు.

యాదాద్రి ఆలయ నిర్మాణాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా తీసుకుంది. పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న సీఎం కేసీఆర్.. యాదాద్రికి (Yadadri Temple) వెళ్లి స్వయంగా పరిశీలించాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా ఆయన ఆదివారం యాదాద్రి పర్యటనకు వచ్చారు.2014లో ప్రారంభించిన యాదాద్రి ఆలయ అభివృద్ధి, పునర్నిర్మాణ పనులు తుది దశకు చేరాయి. ప్రధానాలయంలో శిల్పి పనుల తుది మెరుగులు, శ్రీ పర్వత వర్ధిని రామలింగేశ్వర స్వామి దేవాలయ పునర్నిర్మాణ పనులతో పాటు కొండపైన జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించనున్నారు.

Here's CM KCR Yadadri Tour Video

ఐదేళ్ల క్రితం యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం, విస్తరణ పనులు ప్రారంభించిన నాటి నుంచి కేసీఆర్‌ యాదాద్రికి రావడం ఇది 13వ సారి. ప్రస్తుతం దేశంలోనే అద్భుత రాతి కట్టడంగా అపురూప శిల్పకళా సౌందర్యం ఉట్టిపడేలా యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి.



సంబంధిత వార్తలు

Andhra Pradesh: మంగళగిరి ఎయిమ్స్‌ మొదటి స్నాతకోత్సవం, ఎంబీబీఎస్‌ విద్యార్థులకు బంగారు పతకాలు అందజేసిన రాష్ట్రపతి ముర్ము, ప్రతి డాక్టర్‌ సేవకే ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపు

CM Chandrababu Polavaram Visit Updates: పోలవరం, అమరావతి రాష్ట్రానికి రెండు కళ్లు, 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని తెలిపిన సీఎం చంద్రబాబు

Telangana Congress: కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాసిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్య ప్రచారం తగదు...ఇదే కొనసాగితే ప్రజలు బుద్దిచెప్పడం ఖాయమని వెల్లడి

CM Revanth Reddy: 98 శాతం కులగణన పూర్తి, తెలంగాణకు బహుజనుల తల్లి కావాలి...దొడ్డి కొమురయ్య పేరు శాశ్వతంగా గుర్తుండిపోయేలా చర్యలు తీసుకుంటామన్న సీఎం రేవంత్ రెడ్డి