CM Revanth Reddy Tour: నేడు సీఎం రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట, మూసీ పునరుజ్జీవ యాత్ర.. రెండున్నర కిలోమీటర్లు పాదయాత్ర
శుక్రవారం ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా ఆయన యాదగిరిగుట్ట చేరుకుంటారు.
Hyderabad, Nov 8: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanthreddy) నేడు మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్రను చేపట్టనున్నారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు హైదరాబాద్ (Hyderabad) నుంచి హెలికాప్టర్ ద్వారా ఆయన యాదగిరిగుట్ట చేరుకుంటారు. నేడు తన పుట్టినరోజు సందర్భంగా యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుంటారు. ఆ తర్వాత ఆలయ అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. సమీక్ష అనంతరం అక్కడి నుంచి సంగెంకు చేరుకుంటారు.
మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్ర
ఇక సీఎం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్రను కూడా నేడే రేవంత్ చేపడతారు. శుక్రవారం మధ్యాహ్నాం 1:30లకు రోడ్డుమార్గాన వలిగొండ మండలం సంగెంకు సీఎం రేవంత్ రెడ్డి చేరుకుంటారు. సంగెం నుంచి భీమలింగం వరకు దాదాపు రెండున్నర కిలోమీటర్లు పాదయాత్ర చేస్తారు. పాదయాత్రలో భాగంగా మూసీ పునరుజ్జీవ సంకల్ప రథంపై నుంచి సీఎం ప్రసంగిస్తారు. మూసీ పరీవాహక రైతులతో ఆయన ముచ్చటించనున్నారు.