DK Aruna & Revanth Reddy Arrested: ఎంపీ రేవంత్ రెడ్డి, బీజేపీ నాయకురాలు డీకే అరుణ అరెస్ట్, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును సందర్శించేందుకు వెళుతుండగా అడ్డుకున్న పోలీసులు
ఈ క్రమంలో ఉప్పునుంతల-కొల్లాపూర్ మార్గంలో తెలకపల్లి వద్ద కాంగ్రెస్ నేతల వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. ఎంపీ రేవంత్ సహా పలువురి నేతల వాహనాలను ముందుకు కదలినివ్వలేదు
Hyderabad, Oct 7: కల్వకుర్తి ఎత్తిపోతల పంప్ హౌస్ నీట మునగడంతో దానిని సందర్శించేందుకు బయలుదేరిన కాంగ్రెస్, బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఉప్పునుంతల-కొల్లాపూర్ మార్గంలో తెలకపల్లి వద్ద కాంగ్రెస్ నేతల వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. ఎంపీ రేవంత్ (MP Revanth Reddy( సహా పలువురి నేతల వాహనాలను ముందుకు కదలినివ్వలేదు. దీంతో రేవంత్ గంట పాటు రోడ్డుపైనే కారులో కూర్చొండిపోయారు. అదే సమయంలో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని రోడ్డుపై బైఠాయించారు.
రేవంత్ సహా కాంగ్రెస్ నేతలందరినీ కల్వకుర్తి ఎత్తిపోతల పంప్ హౌస్ (Kalwankurti Lift Irrigation) వద్దకు అనుమతించాలని డిమాండ్ చేశారు. కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కాసేపటికి రేవంత్ కారు నుంచి కిందకు దిగి... పోలీసులతో మాట్లాడే ప్రయత్నం చేయగా.. ఈ క్రమంలో స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది.ఈ ఘటనలో రేవంత్ రెడ్డి కాలికి స్వల్పంగా గాయమైంది.
దీంతో పోలీసులు, కాంగ్రెస్ (Police vs Congress) నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీనితో ఎంపీ రేవంత్ రెడ్డి సహా… ఇతర కాంగ్రెస్ నేతలు సంపత్, మల్లు రవిని పోలీసులు అదుపులోకి (Congress MP Revanth Reddy Arrest) తీసుకున్నారు. ఈ అరెస్టులతో తెలకపల్లిలో (Telkapalli) ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో వారు రోడ్డుపైనే బైఠాయించారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి రోడ్డుపై భైఠాయించారు.
ఈ సందర్భంగా ఎంపీ రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో నిరంకుశత్వం నడుస్తోందని విమర్శించారు. ప్రమాదం గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతిపక్షానికి ఉందన్నారు. ప్రభుత్వం కాంట్రాక్టర్లతో కుమ్మక్కై అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకే.. మమ్మల్ని అనుమతించడం లేదని రేవంత్‌రెడ్డి విమర్శించారు.
తెలంగాణలో తాజాగా 1,451 మందికి కరోనా, 9 మంది మృతితో 1265కు చేరిన మరణాల సంఖ్య, 22,774 కేసులు యాక్టివ్
నిపుణుల కమిటీ నివేదికను పట్టించుకోకుండా కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి సమీపంలోనే పాలమూరు-రంగారెడ్డి సొరంగం మార్గం పనులు చేపట్టారని మండిపడ్డారు. కమీషన్ కక్కుర్తి కోసం ఓపెన్ కెనాల్‌ను సొరంగ మార్గంగా మార్చారని ఆరోపించారు. పోలీసులు ఎంపీ రేవంత్, కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి,ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్‌లను అరెస్ట్ చేసి ఉప్పునుంతల పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
Here's Revanth Reddy Video
ఇదిలా ఉంటే కల్వకుర్తి పంప్ హౌస్‌లో శుక్రవారం మధ్యాహ్నం 3.30గంటల సమయంలో ఉన్నట్టుండి మోటార్ బిగించిన ఫౌండేషన్ బోల్టులు ఒక్కసారిగా ఎగిరిపడ్డాయి. దీంతో భారీ పేలుడు శబ్దం వినిపించింది. ఇంజనీర్లు,సిబ్బంది వెంటనే అప్రమత్తమై బయటకు పరుగుతీశారు. కాసేపటికి మళ్లీ లోపలికి వెళ్లి గమనించగా... మూడో మోటార్ నుంచి భారీగా నీళ్లు పైకి వస్తున్నట్లు గుర్తించారు. దీంతో ఏం జరిగిందో అర్థం కాక ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.
కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలోని మొదటి పంప్ హౌస్ ఉన్న ఎల్లూరుకు కేవలం 400మీ. దూరంలోనే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ పంప్ హౌస్ కోసం సొరంగ మార్గాన్ని చేపట్టడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అక్కడ సొరంగ మార్గం కోసం చేపడుతున్న డ్రిల్లింగ్,బ్లాస్టింగ్స్ కల్వకుర్తి పంప్ హౌస్‌పై ప్రభావం చూపించినట్లు ఆరోపిస్తున్నారు.
ఇక వనపర్తి జిల్లా కల్వకుర్తి వద్ద డీకే అరుణను (DK Aruna Arrest) పోలీసులు అరెస్ట్ చేశారు. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పరిశీలించేందుకు వెళ్లిన ఆమెను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు, బీజేపీ శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పలువురు బీజేపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు.