Hyderabad, Oct 17: తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ప్రతిరోజు నమోదయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య 2 వేల లోపే ఉంటుంది. రాష్ట్ర ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో 1,451 మందికి పాజిటివ్ (Telangana Coronavirus) అని తేలింది. తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 2,20, 675కి చేరుకుంది.
గత 24 గంటల్లో 42, 497 మందికి టెస్టులు నిర్వహించగా 1,451 మందికి పాజిటివ్ గా నిర్థారణ అయింది. గడిచిన 24 గంటల్లో 9 మంది మృతితో మరణాల సంఖ్య 1265కు (Covid Deaths in TS) చేరింది. రాష్ట్రంలో 22.774 కేసులు ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్నాయి.
కొవిడ్‌ను ఎదుర్కోవడంలో దక్షిణాది రాష్ర్టాలలోకెల్లా తెలంగాణ ప్రభుత్వం అద్భుతమైన పనితీరును కనబరిచిందని ఫిక్కీ (ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ), ఆస్కి (అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా), ఎఫ్‌టీసీసీఐ (ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండ స్ట్రీ) పేర్కొన్నాయి.
వైరస్ సోకినవారిని గుర్తించడం, వ్యాధి విస్తరణను నియంత్రించడం, బాధితులకు చికిత్స అందించడంలో దక్షిణాదిలోని ఐదు రాష్ర్టాలకన్నా తెలంగాణ మొదటిస్థానంలో నిలిచిందని ప్రశంసించాయి.
Here's TS Covid Report
Telugu Media Bulletin on status of positive cases #COVID19 in Telangana. (Dated. 17.10.2020)@Eatala_Rajender @TelanganaHealth @GHMCOnline pic.twitter.com/sB6CduAAC3
— Dr G Srinivasa Rao (@drgsrao) October 17, 2020
తెలంగాణ ప్రభుత్వానికి కొవిడ్ కార్యాచరణ ప్రణాళిక సిఫారసులు-2వ దశ’ పేరిట ఈ మూడు సంస్థలు ఒక సంయుక్త నివేదికను విడుదలచేశాయి. వైరస్ వేగంగా విస్తరించకుండా అరికట్టడంలో తెలంగాణ సఫలమైందని తెలిపాయి. తెలంగాణ ప్రభుత్వం ఎక్కడికక్కడ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తూ, హోం క్వారంటైన్‌ను ప్రోత్సహిస్తూ, రాష్ట్రంలో మరణాల సంఖ్యను కూడా గణనీయం గా తగ్గించగలిగిందని ప్రశంసించాయి.