Covid Cases in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో కరోనా తగ్గుముఖం, ఏపీలో తాజాగా 625 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ, తెలంగాణలో 805 కరోనా కేసులు నమోదు

ఆంధ్రపదేశ్‌లో గత 24 గంటల్లో 49,348 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 625 మందికి పాజిటివ్‌గా (AP Coronavirus) నిర్ధారణ అయ్యింది. తెలంగాణలో గత 24 గంటల్లో 805 కరోనా కేసులు (TS Coronavirus) నమోదయ్యాయి.

Coronavirus in India (Photo Credits: PTI)

Hyd, Nov 29: తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుముఖం (Covid Cases in Telugu States) పడుతున్నాయి. ఆంధ్రపదేశ్‌లో గత 24 గంటల్లో 49,348 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 625 మందికి పాజిటివ్‌గా (AP Coronavirus) నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా బారినపడిన వారి సంఖ్య 867063కి చేరుకుంది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. గడచిన 24 గంటల్లో కరోనాతో కృష్ణాలో ఇద్దరు, పశ్చిమగోదావరిలో ఇద్దరు, విశాఖపట్నంలో ఒక్కరు.. మొత్తం ఐదుగురు మరణించారు.

దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా బారిన పడి మృతిచెందిన వారి సంఖ్య 6981కి చేరుకుంది. గడచిన 24 గంటల్లో కోవిడ్‌ నుంచి క్షేమంగా కోలుకుని 1,186 మంది డిశ్చార్జ్‌ అవ్వగా, ఇప్పటివరకు మొత్తం 848511 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఏపీలో ప్రస్తుత్తం 11571 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. నేటి వరకు రాష్ట్రంలో 99,62,416 శాంపిల్స్‌ను పరీక్షించారు.

తెలంగాణలో గత 24 గంటల్లో 805 కరోనా కేసులు (TS Coronavirus) నమోదయ్యాయి. తెలంగాణ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో నలుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 948 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,69,223కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,57,278 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య మొత్తం 1,455కి చేరింది.

కరోనా సెకండ్ వేవ్ చాలా ప్రమాదకరం, వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించిన అత్యున్నత న్యాయస్థానం, 10 రాష్ట్రాల నుంచే కేసులు ఎక్కువగా వస్తున్నాయని తెలిపిన కేంద్రం

తెలంగాణలో ప్రస్తుతం 10,637 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 8,459 మంది హోంక్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 131 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో కొత్తగా 58 కేసులు నిర్ధారణ అయ్యాయి.