Telangana Covid Report: తెలంగాణలో తాజాగా 2,137 మందికి కరోనా, రాష్ట్రంలో 1,71,306కు చేరుకున్న మొత్తం కేసుల సంఖ్య, 1033 మంది మృతి
వైరస్ బారినపడిన వారిలో 2,192 మంది చికిత్సకు కోలుకుని డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,71,306 మంది కరోనా బారినపడగా 1,39,700 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 30,573 మంది వివిధ దవాఖానల్లో చికిత్స పొందుతుండగా 24,019 మంది హోం ఐసోలేషనల్‌లో ఉన్నారు.
Hyderabad, Sep 20: తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 2,137 పాజిటివ్ కేసులు (Telangana Covid Report) నమోదుకాగా 8 మంది ప్రాణాలు కోల్పోయారు. వైరస్ బారినపడిన వారిలో 2,192 మంది చికిత్సకు కోలుకుని డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,71,306 మంది కరోనా బారినపడగా 1,39,700 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 30,573 మంది వివిధ దవాఖానల్లో చికిత్స పొందుతుండగా 24,019 మంది హోం ఐసోలేషనల్‌లో ఉన్నారు.
తీవ్రమైన ఇన్‌ఫెక్షన్ కారణంగా 1033 మంది మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 53,811 మందికి కరోనా (COVID) నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటివరకు 24,88,220 టెస్టులు చేసినట్లు అధికారులు తెలిపారు. తెలంగాణలో కరోనా మరణాల రేటు 0.60శాతంగా ఉండగా, రికవరీ రేటు 81.54శాతంగా ఉందని వైద్యారోగ్య శాఖ వివరించింది. తాజాగా నమోదైన కేసుల్లో హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 322 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
కొత్తగా జీహెచ్‌ఎంసీ (GHMC) పరిధితో 322 పాజిటీవ్ కేసులు నమోదు కాగా.. రంగారెడ్డి 182, మేడ్చల్ 146, భద్రాద్రి కొత్తగూడెం 51, మంచిర్యాల్ 38, మెదక్ 28, ములుగు 15, నాగర్ కర్నూల్ 37, నల్గొండలో 124 కరోనా కేసులు నమోదయ్యాయి.రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య రోజురోజుకూ గణనీయంగా పెరుగుతోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో నిర్ధారణ పరీక్షల సంఖ్య 24,34,409కి చేరుకుంది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,69,169 నమోదైనట్లు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ మేరకు శనివారం ఉదయం ఆయన కరోనా బులెటిన్ విడుదల చేశారు.
రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య రోజురోజుకూ గణనీయంగా పెరుగుతోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో నిర్ధారణ పరీక్షల సంఖ్య 24,34,409 దాటిందని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ మేరకు శనివారం ఉదయం ఆయన కరోనా బులెటిన్ విడుదల చేశారు. ఇప్పటివరకు నమోదైన కేసుల్లో లక్షణాలు లేకుండా వైరస్‌బారిన పడినవారు 1,18, 418 (70%) మంది ఉండగా, లక్షణాలతో కరోనా సోకినవారు 50,751 (30%) మంది ఉన్నారు. కాగా, దేశంలో కోలుకున్నవారి రేటు 79.26 శాతం ఉంటే, తెలంగాణలో అది 81.28 శాతానికి చేరుకోవడం గమనార్హం. దేశంలో మరణాల రేటు 1.61 శాతం ఉండగా, తెలంగాణలో 0.60 శాతం ఉంది.