TS Coronavirus Update: కరోనా వ్యాక్సిన్ కొవాగ్జిన్‌‌పై నిమ్స్‌లో మొదలైన ట్రయల్స్, తెలంగాణలో తాజాగా 502 మందికి కరోనా, ముగ్గురు మృతితో 1407కు చేరిన మొత్తం మరణాల సంఖ్య

దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,57,876కు (Coronavirus Cases) చేరింది. నిన్న ఒక్కరోజే 1,539 మంది వైరస్‌ బారినుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు మొత్తం 8,28,484 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 18,659. వైరస్‌ బాధితుల్లో కొత్తగా ముగ్గురు మృతి చెందడంతో.. మొత్తం మృతుల సంఖ్య 1407కు (Coronavirus Deaths) చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్యారోగ్యశాఖ కరోనాపై హెల్త్‌​ బులెటిన్‌ విడుదల చేసింది.

Coronavirus in TS| (Photo Credits: PTI)

Hyd, Nov 16: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 502 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు (TS Covid Report) నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,57,876కు (Coronavirus Cases) చేరింది. నిన్న ఒక్కరోజే 1,539 మంది వైరస్‌ బారినుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు మొత్తం 8,28,484 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 18,659. వైరస్‌ బాధితుల్లో కొత్తగా ముగ్గురు మృతి చెందడంతో.. మొత్తం మృతుల సంఖ్య 1407కు (Coronavirus Deaths) చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్యారోగ్యశాఖ కరోనాపై హెల్త్‌​ బులెటిన్‌ విడుదల చేసింది.

ఇప్పటివరకు మొత్తం 2,42,084 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 14,385 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 11,948 మంది హోంక్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 141 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో కొత్తగా 72 కేసులు నిర్ధారణ అయ్యాయి.

భారత వైద్య పరిశోధన మండలి(ICMR)తో కలిసి నగరానికి చెందిన భారత్‌ బయోటెక్స్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయిల్స్‌ శరవేగంగా జరుగుతున్నాయని నిమ్స్‌ వైద్యులు పేర్కొంటున్నారు. కోవాగ్జిన్‌ టీకాను వచ్చే ఏడాది ఫిబ్రవరికి రెడీ చేసేందుకు ఐసిఎంఆర్‌ కార్యచరణ ప్రణాళికలను రూపొందించినట్టు సమాచారం. ఇప్పటి వరకు మొదటి రెండు దశల్లో ట్రయల్స్‌ విజయవంతంగా జరిగాయి.

ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్, కరోనా కాలంలో కట్ అయిన జీతాలు తిరిగి చెల్లించాలని ఆదేశాలు, ఈ నెల 23 నుంచి వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్‌

ఆయా దశల్లో టీకా వేయించుకున్న వాలంటీర్లందరూ ఆరోగ్యంగానే ఉన్నారు. కోవాగ్జిన్‌ క్లినికల్‌ ట్రయిల్స్‌ చివరి దశ టీకా ప్రయోగానికి ముమ్మరంగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ ట్రయిల్స్‌ని నిర్వహిస్తున్న ఆస్పత్రుల్లో ఒకటైన నిజాం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(నిమ్స్‌) సోమవారం నుంచి ట్రయల్స్‌ను కొనసాగించేందుకు సమాయత్తమవుతుంది. ఈ దశలో దాదాపుగా 600 మంది వాలంటీర్లకు టీకాలు వేయనున్నామని నిమ్స్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ నోడల్‌ వైద్య బృందం వెల్లడించింది.