Cyber Criminals: మోసానికి సైబర్ నేరగాళ్ల కొత్త మార్గం.. కరెంటు బిల్లు పెండింగ్ ఉందంటూ మెసేజ్‌లు.. లింక్ పై క్లిక్ చేస్తే అంతే... రూ. 6 లక్షలు పోగొట్టుకున్న హైదరాబాద్ వాసి.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక
ఇప్పుడు ఏకంగా విద్యుత్ వినియోగదారులపైనే పడ్డారు. కరెంటు బిల్లు పెండింగులో ఉందని, చెల్లించకుంటే కనెక్షన్ కట్ చేస్తామంటూ మెసేజ్‌లు పంపిస్తున్నారు.
Hyderabad, Aug 6: కొత్త మోసాలతో సైబర్ నేరగాళ్లు (Cyber Criminals) నయా రూట్లు వెదుకుతూనే ఉన్నారు. ఇప్పుడు ఏకంగా విద్యుత్ వినియోగదారులపైనే (Electricity Customers) పడ్డారు. కరెంటు బిల్లు (Power Bill) పెండింగులో (Pending) ఉందని, చెల్లించకుంటే కనెక్షన్ కట్ (Connection Cut) చేస్తామంటూ మెసేజ్‌లు పంపిస్తున్నారు. నమ్మి వారు పంపిన మెసేజ్‌లోని లింకుపై క్లిక్ చేస్తే ఇక వారి పని అంతే. బ్యాంకు ఖాతాలోని సొమ్ము ఖాళీ అవుతుంది. హైదరాబాద్‌లోని నారాయణగూడకు చెందిన ఓ వ్యక్తి ఇలానే రూ. 6 లక్షలు పొగొట్టుకున్నాడు. ఆయన పోలీసులను ఆశ్రయించడంతో ఈ నయా మోసం వెలుగులోకి వచ్చింది.
విద్యుత్‌శాఖ అధికారులు ఏమంటున్నారంటే?
సైబర్ నేరగాళ్ల తాజా మోసంపై విద్యుత్‌శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. బిల్లులు పెండింగులో ఉన్నాయంటూ ఫోన్లకు వచ్చే మెసేజ్ లను నమ్మవద్దని తెలిపారు. తాము అలా పంపబోమని చెబుతున్నారు.