Deepthi Jeevanji: పారాలంపియన్ దీప్తికి రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్, కోటి రూపాయల నగదు, గ్రూప్-2 ఉద్యోగం ప్రకటన
దీప్తికి గ్రూప్-2 ఉద్యోగం, రూ.కోటి నగదు బహుమతి, వరంగల్‌లో 500 గజాల స్థలం, కోచ్‌కు రూ.10లక్షలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆదేశించారు.
Hyderabad, SEP 07: పారాలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన తెలంగాణ యువ అథ్లెట్ దీప్తి జీవాంజిని (Deepthi Jeevanji) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. దీప్తికి గ్రూప్-2 ఉద్యోగం, రూ.కోటి నగదు బహుమతి, వరంగల్‌లో 500 గజాల స్థలం, కోచ్‌కు రూ.10లక్షలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆదేశించారు. పారాలింపిక్స్ (Paralympics) క్రీడాకారులకు శిక్షణ, ప్రోత్సాహానికి ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.
దీప్తికి గ్రూప్-2 ఉద్యోగంతో పాటు కోటి రూపాయాల నజరానా ప్రకటించిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శాట్ చైర్మన్ శివసేనా రెడ్డి, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Here's Video
పారా ఒలింపిక్స్‌లో (Paralympics) భాగంగా సెప్టెంబర్ 3వ తేదీ రాత్రి జరిగిన మహిళల 400 మీటర్ల T20లో ఫైనల్‌లో 55.82 సెకన్లలో లక్ష్యాన్ని ఛేదించి మూడో స్థానంలో నిలిచింది. ప్రపంచ రికార్డుతో కాంస్య పతకాన్ని సాధించింది. తెలంగాణకు తొలిసారిగా ఒలింపిక్స్‌లో పతకాన్ని సాధించి పెట్టింది. దీప్తి స్వస్థలం వరంగల్ జిల్లా కల్లెడ గ్రామం.