Hyd, Sep 7: ఖైరతాబాద్ గణేశుడికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తొలిపూజ చేశారు. అనంతరం మాట్లాడిన సీఎం రేవంత్.. గణేశ్ ఉత్సవాలకు ఉచిత విద్యుత్ అందించాం అని తెలిపారు. గణేశ్ ఉత్సవాలను ఇంత గొప్పగా జరిపిస్తున్న ఉత్సవ కమిటీకి ధన్యవాదాలు చెప్పారు. గతేడాది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా, ఈ ఏడాది సీఎంగా ఇక్కడికి వచ్చాను అని తెలిపారు.
వినాయక చవితి ఉత్సవాలు జరిపించడానికి ప్రభుత్వం తరపున సంపూర్ణ సహకారం అందించాం అన్నారు రేవంత్.ఈ ఏడాదిలో అత్యధికంగా వర్షాలు కురిశాయయని.. దేవుడి దయతో వరదల వల్ల ఎక్కువ నష్టం జరగలేదు అని తెలిపారు.
అంతకముందు సప్తముఖ వినాయకుడి వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రికి స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్ యాదవ్, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ దీపాదాస్ మున్షీ తదితరులు పాల్గొన్నారు. ఖైరతాబాద్ గణేశుడి సన్నిధిలో సీఎం రేవంత్ రెడ్డి, ప్రత్యేక పూజలు చేసిన తెలంగాణ సీఎం..
Here's Video:
ఖైరతాబాద్ గణేశుడికి సీఎం రేవంత్ తొలిపూజ
TG: ఖైరతాబాద్ గణేశుడిని సీఎం రేవంత్‌రెడ్డి దర్శించుకున్నారు. సప్తముఖ వినాయకుడి వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రికి స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ స్వాగతం పలికారు. అనంతరం రేవంత్‌రెడ్డి.. మహాగణపతికి గజమాల, పండ్లు సమర్పించారు. వినాయకుని… pic.twitter.com/iIrtLOAV5p
— ChotaNews (@ChotaNewsTelugu) September 7, 2024
ఖైరతాబాద్ గణనాథుడికి నేటితో 70 ఏళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా 70 అడుగుల ఎత్తులో సప్తముఖ మహాశక్తి గణపతిని ప్రతిష్ఠించారు. పెద్ద ఎత్తున భక్తులు గణనాథుడిని దర్శించుకునేందుకు వచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
Here's Videoo:
రాష్ట్రంలోని అన్ని గణేష్ ఉత్సవ కమిటీలకు ప్రభుత్వం అండగా ఉంటుంది - సీఎం రేవంత్ రెడ్డి pic.twitter.com/yXuEUOYjGl
— ChotaNews (@ChotaNewsTelugu) September 7, 2024