Jubilee Hills Shocker: మహిళా ఐఏఎస్ అధికారి ఇంట్లోకి అర్ధరాత్రి డిప్యూటీ తహసీల్దార్ చొరబాటు.. ఎందుకొచ్చావ్ అన్న అధికారిణి? అతని సమాధానం ఏంటంటే?? జూబ్లీహిల్స్‌ లో కలకలం

రెండు రోజుల క్రితం ఈ ఘటన జరగ్గా తాజాగా వెలుగులోకి వచ్చింది.

Credits: Twitter (Representational Image)

Hyderabad, Jan 22: హైదరాబాద్ (Hyderabad) జూబ్లీహిల్స్‌ (Jubileehills) లో నివసిస్తున్న ఓ మహిళా ఐఏఎస్ (IAS)  ఇంట్లోకి అర్ధరాత్రి వేళ డిప్యూటీ తహసీల్దార్ (Deputy Tahsildar) చొరబడడం కలకలం రేపింది. రెండు రోజుల క్రితం ఈ ఘటన జరగ్గా తాజాగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జూబ్లీహిల్స్‌ లోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో ఉంటున్న మహిళా ఐఏఎస్ అధికారి సోషల్ మీడియాలో (Social Media) చురుగ్గా ఉంటారు. ఆమె ట్వీట్లకు డిప్యూటీ తహసీల్దార్ (48) ఒకటి రెండుసార్లు రీట్వీట్లు చేశారు.

ఫిబ్రవరి 3 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారు, ఇండ్లు కట్టుకునేవారికి ఆర్ధికసాయంపై మధ్యతరగతి ఆశలు

ఈ క్రమంలో రెండు రోజుల క్రితం రాత్రి 11.30 వేళ తన స్నేహితుడైన ఓ హోటల్ యజమానిని తీసుకుని కారులో నేరుగా ఆమె ఉండే గేటెడ్ కమ్యూనిటీకి వెళ్లాడు. అక్కడ కాపలా సిబ్బందికి తాను పలానా వద్దకు వెళ్లాలని చెప్పడంతో వారు అనుమతించారు. దీంతో స్నేహితుడిని కారులోనే ఉంచిన డిప్యూటీ తహసీల్దార్ ఆమె ఇంటికి వెళ్లి తలుపు తట్టాడు. తలుపు తెరిచిన అధికారిణి ఎదురుగా గుర్తు తెలియని వ్యక్తి కనిపించడంతో షాకయ్యారు.

ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. ఇక తెలుగులోనూ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్ష.. హిందీ, ఇంగ్లిష్‌తోపాటు 13 స్థానిక భాషల్లోనూ పరీక్ష 

ఆ తర్వాత తేరుకుని.. ఎవరు నువ్వు? ఎందుకొచ్చావని ప్రశ్నించారు. స్పందించిన డిప్యూటీ తహసీల్దార్ గతంలో మీకు ట్వీట్ చేశానని, ఉద్యోగం గురించి మాట్లాడేందుకు వచ్చానని చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె తక్షణం ఇక్కడి నుంచి వెళ్లాలని చెబుతూ కేకలు వేశారు. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కారును జప్తు చేసిన పోలీసులు అతడి స్నేహితుడిని కూడా అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు.

నెల్లూరులో అర్ధరాత్రి రైలు ఢీకొని ముగ్గురి దుర్మరణం.. పట్టాలపై ఉన్న మహిళను రక్షించే ప్రయత్నంలో పురుషులు మరణించారంటున్న ప్రత్యక్ష సాక్షులు