HYD Metro- TSRTC: శుక్రవారం నుంచి జేబీఎస్- ఎంజీబీఎస్ మెట్రో రైలు ప్రారంభం, ఆర్టీసీ కార్గో ద్వారా ప్రజలకు సేవలు కల్పించడం ముఖ్యం, చౌకబారు ప్రచారం వద్దని అధికారులకు సీఎం కేసీఆర్ సూచన

జేబీఎస్- ఎంజీబీఎస్ మధ్య మొత్తం 9 స్టేషన్లు ఉండనున్నాయి. మార్గం ఈ విధంగా ఉంటుంది. జేబీఎస్-పరేడ్ గ్రౌండ్స్, సికింద్రాబాద్ వెస్ట్, గాంధీ హాస్పిటల్, ముషీరాబాద్, ఆర్‌టీసి క్రాస్‌రోడ్స్, చిక్కడ్‌పల్లి, నారాయణగూడ, సుల్తాన్ బజార్ మరియు ఎంజీబీఎస్....

Hyderabad Metro - CM KCR | File Photo

Hyderabad, February 05: హైదరాబాద్ నగరవాసులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న జూబ్లీ బస్ స్టేషన్- మహాత్మా గాంధీ బస్ స్టేషన్ మెట్రో మార్గం  (JBS- MGBS Metro) ఈ శుక్రవారం నుంచి అందుబాటులోకి రానుంది. సీఎం కేసీఆర్ (CM KCR) శుక్రవారం సాయంత్రం 4 గంటలకు జెండా ఊపి ఈ సర్వీసును ప్రారంభించనున్నారు. దీంతో జేబీఎస్ - ఎంజీబీఎస్ మధ్య ప్రయాణం సులభతరం కావడమే కాకుండా, సమయం కూడా ఆదా అవుతుంది.

జేబీఎస్- ఎంజీబీఎస్ మధ్య మొత్తం 9 స్టేషన్లు ఉండనున్నాయి. మార్గం ఈ విధంగా ఉంటుంది. జేబీఎస్-పరేడ్ గ్రౌండ్స్, సికింద్రాబాద్ వెస్ట్, గాంధీ హాస్పిటల్, ముషీరాబాద్, ఆర్‌టీసి క్రాస్‌రోడ్స్, చిక్కడ్‌పల్లి, నారాయణగూడ, సుల్తాన్ బజార్ మరియు ఎంజీబీఎస్. తర్వాత ఇది ఫలక్ నుమ వరకు విస్తరించబడుతుంది.

హైదరాబాద్ మెట్రోలో ఉచిత వీడియో స్ట్రీమింగ్ మరియు ఎంటర్టైన్మెంట్ 

హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) ఇప్పటికే ఎల్బీ నగర్-మియాపూర్ మరియు నాగోల్-రాయదుర్గ్ కారిడార్లలోని సేవలతో నగరంలో తూర్పు- పడమర కనెక్టివిటీని కలుపగా. ఇప్పుడు ఈ జేబీఎస్-ఎంజీబిఎస్ మార్గం నగరంలోని ఉత్తర- దక్షిణ కనెక్టివిటీని కల్పించినట్లవుతుంది. అంతేకాకుండా నగరంలో 69 కిలోమీటర్ల నెట్‌వర్క్ తో మెట్రో ప్రాజెక్టు మొదటి దశ పూర్తయినట్లు సూచిస్తుంది.

 

చౌకబారు ప్రచారం చేయొద్దు- సీఎం కేసీఆర్

సామాను రవాణా చేసే తెలంగాణ ఆర్టీసీ కార్గో (TSRTC Cargo) బస్సులపై తన ఫోటోలు పెట్టడానికి ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తున్నట్లు మీడియాలో ప్రచారం జరగడంపై సీఎం కేసీఆర్ తప్పు పట్టారు. సామాను రవాణాకు ఆర్టీసీ కార్గో బస్సులను ఉపయోగించడం వల్ల ప్రజలకు సేవలు అందించడం, ఆర్టీసీ లాభాల్లో పయనించడం తన లక్ష్యం అన్నారు. బస్సులపై ఫోటోలు వేయించుకుని ప్రచారం చేసుకోవాల్సిన అవసరం తనకు లేదని, ఈ ప్రతిపాదన ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని సీఎం అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు ద్వారా ప్రజలు లబ్ది పొందాలే తప్ప, దాంతో చౌకబారు ప్రచారం పొందడం తమ అభిమతం కాదని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. కార్గో బస్సులపై సీఎం ఫోటో ఉండకూడదని సూచించారు.

ఇటీవల రవాణామంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ, టీఎస్ ఆర్టీసీకి బ్రాండ్ అంబాసిడర్ సీఎం కేసీఆరే అని, ఇకపై ఆర్టీసీని లాభాల్లోకి తీసుకువచ్చేందుకు వినూత్న ప్రయోగాలు చేస్తాం, త్వరలో ప్రారంభం కాబోయే ఆర్టీసీ కార్గో బస్సులపై సీఎం కేసిఆర్ చిత్రపటాలతో పాటు ప్రజలు ఆర్టీసి బస్సులను ఇష్టపడేలా సూక్తులు, ప్రగతి నినాదాలు కనిపిస్తాయని మంత్రి అన్నారు. దీంతో కార్గో సర్వీసులపై సీఎం కేసీఆర్ ఫోటోలు అంటూ కొన్ని మీడియా హౌజ్ లు ప్రధానంగా వార్తలు వేశాయి. ఈ నేపథ్యంలో ఆ వార్తలను తప్పుబడుతూ సీఎంఓ ప్రకటన విడుదల చేసింది.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

BRSLP Meeting Update: 11న బీఆర్ఎస్‌ఎల్పీ సమావేశం.. మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన శాసనసభాపక్షం సమావేశం, అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ

CM Revanth Reddy: ఆత్మగౌరవంలోనే కాదు.. త్యాగంలోనూ పద్మశాలీలు ముందుంటారు, సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు, ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడుతున్నట్లు ప్రకటన

Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్‌ ఉండాలని వెల్లడి

Advertisement
Advertisement
Share Now
Advertisement