Road Accident: జర్నీ సినిమాను తలపించేలా యాక్సిడెంట్.. మెదక్ జిల్లా నర్సాపూర్ బీవీఆర్ఐటీ కాలేజీ బస్సులకు ప్రమాదం.. డ్రైవర్ మృతి.. పలువురు విద్యార్థులకు గాయాలు

ఈ ఘటనలో ఒకరు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన మెదక్ జిల్లాలోని నర్సాపూర్ వద్ద శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది.

Bus Accident (Credits: X)

Medak, Sep 27: జర్నీ సినిమా క్లైమాక్స్ లో వచ్చే యాక్సిడెంట్ సీక్వెన్స్ ను తలపించేలా రెండు కాలేజీ బస్సులు (College Buses) ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన మెదక్ (Medak) జిల్లాలోని నర్సాపూర్ వద్ద శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. బీవీ రాజు ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలకు (బీవీఆర్ఐటీ) చెందిన ఓ బస్సు ఉదయం విద్యార్థులను పిక్ చేసుకుని కళాశాలకు వెళ్తోంది. ఈ క్రమంలోనే ఓ వాహనాన్ని ఓవర్టేక్ చేస్తున్న క్రమంలో అదే కళాశాలకు చెందిన మరో బస్సును ఎదురెదురుగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎదురుగా వస్తున్న బస్సులోని డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.

తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు.. ఏకకాలంలో 16 చోట్ల సోదాలు.. భారీగా పోలీసు బందోబస్తు

విద్యార్థులకు గాయాలు

ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులకు కూడా గాయాలయ్యాయి. ఇది గమనించిన వాహనదారుల పోలీసులకు సమాచారం అందించారు.  గాయపడిన విద్యార్థులను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదం నేపథ్యంలో రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది.

నేడు తిరుమలకు జగన్‌.. తిరుపతిలో విస్తృతంగా వాహనాల తనిఖీలు.. పోలీస్ యాక్ట్ 30 అమలు



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif