Fire Accident at Lord Balaji Temple: వేంకటేశ్వరస్వామి ఆలయంలో భారీ అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన స్వామి వారి పల్లకి, ఉత్సవ పీటలు.. పూర్తిగా కాలిపోయిన అద్దాల మండపం.. అరిష్టం అంటున్న వేద పండితులు.. హైదరాబాద్ లో ఘటన (వీడియో)

షార్ట్ సర్క్యూట్ వల్ల ఆలయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

Fire Accident at Lord Balaji Temple (Credits: X)

Hyderabad, Nov 3: హైదరాబాద్ (Hyderabad) పాతబస్తీ సంతోష్ నగర్ లోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో (Balaji Temple) భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ వల్ల ఆలయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అద్దాల మండపం దగ్ధమయ్యింది. అలాగే స్వామి వారి పల్లకి, ఉత్సవ పీటలు అగ్నికి ఆహుతయ్యాయి. ఆలయ సిబ్బంది ఇచ్చిన సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టులో మూడు విమానాలకు బాంబు బెదిరింపు కాల్.. అప్రమత్తమైన ఎయిర్ పోర్టు భద్రతా సిబ్బంది.. ఆలస్యంగా విమానాలు

అరిష్టమే..

కాగా, కార్తీక మాస ఆరంభంలో ఇలా స్వామివారి ఆలయంలో అగ్ని ప్రమాదం జరుగడం, అద్దాల మండపం, స్వామి వారి పల్లకి, ఉత్సవ పీటలు అగ్నికి ఆహుతవ్వడంపై ఆలయ పండితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది అరిష్టమేనని వేద పండితులు పేర్కొంటున్నారు. ప్రాయశ్చిత్త సంప్రోక్షణ చర్యలు చేపట్టనున్నట్టు ఆలయ అధికారి ఒకరు పేర్కొన్నారు.

నేను ఏ టెస్టులకైనా సిద్ధమంటూ మెరుగు నాగార్జున సవాల్, మహిళ తనపై చేసిన అత్యాచారం ఆరోపణలను ఖండించిన వైసీపీ నేత, వీడియో ఇదిగో..



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif