Hyderabad Horror: హైదరాబాద్ లో ఘోరం.. పంటి చికిత్సకు వెళ్తే ఏకంగా ప్రాణం పోయింది.. నిశ్చితార్థం జరిగిన మరుసటి రోజే యువకుడి ఇంట్లో విషాదం.. డెంటల్‌ దవాఖాన నిర్వాహకులపై కేసు.. అసలేం జరిగింది??

పంటి చికిత్స కోసం డెంటల్‌ దవాఖానకు వెళ్లిన యువకుడు చివరకు ప్రాణాలు కోల్పోయాడు. నిశ్చితార్థం జరిగిన మరుసటి రోజే యువకుడు చనిపోవడం కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది.

Lakshminarayana (Credits: X)

Hyderabad, Feb 20: హైదరాబాద్ లో (Hyderabad) ఘోరం జరిగింది. పంటి చికిత్స కోసం డెంటల్‌ దవాఖాన (Dental Hospital)కు వెళ్లిన యువకుడు చివరకు ప్రాణాలు కోల్పోయాడు. నిశ్చితార్థం జరిగిన మరుసటి రోజే యువకుడు చనిపోవడం కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మిర్యాలగూడలోని సరస్వతినగర్‌కు చెందిన వింజం లక్ష్మీనారాయణ (28) తన కుటుంబంతో కలిసి హైదరాబాద్ లోని కూకట్‌ పల్లిలో నివాసం ఉంటున్నారు. ఈ నెల 15న లక్ష్మీనారాయణకు నిశ్చితార్థం జరిగింది. మార్చి 13న పెళ్లికి ముహూర్తం ఉండటంతో.. గత కొంతకాలంగా పంటినొప్పి ఉండటంతో కింది వరుస పళ్లను సరిచేసుకోవాలని లక్ష్మీనారాయణ నిర్ణయించుకున్నాడు. దీనికోసం జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబర్‌ 37లోని ఎఫ్‌ఎంఎస్‌ డెంటల్‌ దవాఖాన వైద్యులను సంప్రదించారు. అయితే, చికిత్స సమయంలో అనస్తీషియా డోస్ అధికంగా ఇవ్వడంతో ఫిట్స్ వచ్చి లక్ష్మీనారాయణ స్పృహ కోల్పోయాడు.

Kagney Linn Karter Passes Away: షాకింగ్.. శృంగార తార కాగ్నె లిన్ కార్తర్ (36) ఆత్మహత్య

హుటాహుటిన అంబులెన్స్‌ లో..

ఆందోళనకు గురైన ఎఫ్‌ఎంఎస్‌ దవాఖాన సిబ్బంది లక్ష్మీనారాయణను హుటాహుటిన అంబులెన్స్‌ లో అపోలో దవాఖాన తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. ఎఫ్‌ఎంఎస్‌ డెంటల్‌ క్లినిక్‌ వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ కొడుకు మృతి చెందాడంటూ మృతుడి తండ్రి రాములు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

NITI Aayog Tax Reforms: వృద్ధులకు తప్పనిసరి సేవింగ్స్‌ ప్లాన్‌.. ప్రభుత్వ మేధోసంస్థ నీతి ఆయోగ్‌ సూచన



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif