HYDRA 2.0: హైడ్రా 2.0.. అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం.. సంగారెడ్డిలో కూల్చివేతలు షురూ.. (వీడియో)

సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలో సోమవారం ఉదయం హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు.

HYDRA 2.0 (Credits: X)

Hyderabad, Nov 18: భూఆక్రమణలు చేసిన అక్రమార్కుల పాలిట ఉక్కుపాదం మోపిన హైడ్రా (HYDRA) వెర్షన్ 2.0 ప్రారంభమైనట్టు తెలుస్తున్నది.  సంగారెడ్డి జిల్లా (Sangareddy) అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలో సోమవారం ఉదయం హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. వందనపురి కాలనీలో 848 సర్వే నంబర్‌ లో అక్రమ నిర్మాణంపై కొరడా ఝుళిపించారు. రోడ్డును ఆక్రమించి చేపట్టిన ఇండ్ల నిర్మాణాలను  భారీ యంత్రాలతో కూల్చివేస్తున్నారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు.

ముహూర్త సమయం ముగిసిపోతున్నది.. వరుడు ఇక్కడ.. పెండ్లి అక్కడ.. దీంతో వరుడి కోసం ఆగిన రైలు.. ఏంటా సంగతి??

Here's Video:

ఏమిటీ హైడ్రా?

తెలంగాణలో అక్రమ నిర్మాణాల కూల్చివేతల కోసం కాంగ్రెస్ సర్కార్ తీసుకున్న సంచలన నిర్ణయమే హైడ్రా (HYDRA). దీనిని ఏర్పాటు చేసి మూడున్నర నెలలు దాటింది. ఎఫ్టీఎల్‌, బఫర్ జోన్ పరిధిలో ఉన్న చాలా అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చి వేసింది. రాష్ట్ర చరిత్రలోనే మూడున్నర నెలల వ్యవధిలో 300కు పైగా అక్రమ నిర్మాణాల హైడ్రా నేలమట్టం చేసింది.

తెలంగాణలో కొత్త ఈవీ పాలసీ... 100 శాతం పన్నుతో పాటు రిజిస్ట్రేషన్ ఫీజు కూడా మినహాయింపు.. నేటి నుంచే అమల్లోకి..!