Modi Hyderabad Visit: రేపు భాగ్యనగరానికి ప్రధాని మోదీ.. ధర్నాలతో స్వాగతం పలకనున్న బీఆర్ఎస్.. ఈమేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు, జిల్లా అధ్యక్షులకు కేటీఆర్ పిలుపు.. ఫోన్ లో మాట్లాడి దిశా నిర్దేశం
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన, సికింద్రాబాద్ - తిరుపతి మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ ప్రారంభించడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి ప్రధాన మంత్రి మోదీ రేపు హైదరాబాద్ పర్యటనకు వస్తున్నారు. అయితే,
Hyderabad, April 7: ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) భాగ్యనగరానికి (Hyderabad) రానున్న వేళ రాజకీయం రసకందాయంలో పడినట్టు కనిపిస్తున్నది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ (Secunderabad Railway Station) పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన, సికింద్రాబాద్ - తిరుపతి మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ (Vande Bharat Express) ప్రారంభించడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి ప్రధాన మంత్రి మోదీ రేపు హైదరాబాద్ పర్యటనకు వస్తున్నారు. పరేడ్ గ్రౌండ్స్ లో బహిరంగ సభలోనూ మోదీ పాల్గొననున్నారు. మోదీ టూర్ ను, బహిరంగ సభను విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర నేతలు భావిస్తున్నారు. సభకు భారీ ఎత్తున జన సమీకరణ చేసే పనిలోఉన్నారు. మరోవైపు ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనకు వస్తున్న రోజే బీఆర్ఎస్ ధర్నాలకు దిగనుంది. సింగరేణి బొగ్గు బ్లాకుల వేలాన్ని నిరసిస్తూ మహాధర్నా చేయాలని ఆ ప్రాంత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, జిల్లా అధ్యక్షులను బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆదేశించారు.
కేంద్రం కుప్పకూలుతుంది
మోదీ రాష్ట్రానికి వస్తున్న రోజే సింగరేణి బొగ్గు బ్లాకుల అంశంపై మంచిర్యాల, భూపాలపల్లి, కొత్తగూడెం, రామగుండంలో ధర్నా చేయాలని కేటీఆర్ఆదేశించడం రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశం అవుతున్నది. ధర్నా విజయవంతం చేసి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన నేతలను ఆదేశించారు. మే 30లోగా ఈ బొగ్గు బ్లాకుల వేలం ప్రక్రియ పూర్తి చేయాలంటూ కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్ ను వెంటనే వెనక్కి తీసుకొని, వేలంతో సంబంధం లేకుండా సింగరేణికే ఈ బ్లాకులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ‘సింగరేణిని ప్రైవేటీకరించబోమని 2022 నవంబర్ 12న రామగుండం పర్యటనలో ప్రధాని మోదీ చెప్పారు.. కానీ ఆ మాట నిలుపుకోకుండా ప్రైవేటీకరణకు కుట్ర చేస్తున్నారు. ఈసారి పురుడు పోసుకునే మహోద్యమంతో కేంద్రం కుప్పకూలుతుంది’ అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.