KTR Legal Notices: బండి సంజయ్, రేవంత్ రెడ్డిలకు లీగల్ నోటీసులు పంపిన కేటీఆర్.. టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంలో నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారంటూ కేటీఆర్ మండిపాటు.. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేస్తున్నారంటూ విమర్శ

నిరాధార, అసత్య ఆరోపణలు చేసినందుకుగాను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌లకు లీగల్‌ నోటీసులు పంపిస్తున్నట్లు కేటీఆర్‌ తెలిపారు.

Telangana IT Minister KTR (PIC @ FB)

Hyderabad, March 24: టీఎస్‌పీఎస్సీ (TSPSC) ప్రశ్నపత్రాల (Question Papers) లీకేజీ (Leak) వ్యవహారంపై కాంగ్రెస్‌ (Congress), బీజేపీ (BJP) నేతలు నిరాధార, అసత్య ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ (KTR) మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. నిరాధార, అసత్య ఆరోపణలు చేసినందుకుగాను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy), తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ (Bandi Sanjay)లకు లీగల్‌ నోటీసులు పంపిస్తున్నట్లు కేటీఆర్‌ తెలిపారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన సంస్థ అనే జ్ఞానం కూడా లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వాస్తవాలను పక్కన పెట్టి ప్రభుత్వ పరిధిలోనే ఇదంతా జరుగుతోందనే విధంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. వీరిద్దరూ మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయారని ప్రజలు కూడా భావిస్తున్నారని చెప్పారు. వీరి నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ పరిస్థితి పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని అన్నారు. కాగా టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంలో మంత్రి కేటీఆర్ పై రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

Rains In Telugu States: తెలంగాణలో నేడు, రేపు వడగళ్ల వర్షాలు.. హైదరాబాద్ నగరవాసులకు వాతావారణ శాఖ హెచ్చరికలు.. వచ్చే ఐదు రోజులపాటు ఆంధ్రప్రదేశ్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు

ఇంకా కేటీఆర్ ఏమన్నారంటే?

రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌కు స్వయంప్రతిపత్తి ఉంటుందన్న కనీస అవగాహన కూడా లేకుండా ఈ అంశంలోకి ప్రభుత్వాన్ని, తనను లాగడం వారి అజ్ఞానానికి నిదర్శనమని కేటీఆర్ మండిపడ్డారు. స్వతంత్రంగా పరీక్షల నిర్వహణ, ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వంతో సంబంధం లేకుండా పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వ్యవస్థ ఏర్పాటైందని గుర్తుచేశారు. కానీ, ఈ మొత్తం వ్యవహారం ప్రభుత్వ పరిధిలో జరుగుతున్నట్లుగా చిత్రీకరించే దుర్మార్గపూరిత కుట్రలకు సంజయ్‌, రేవంత్‌ తెరలేపారని కేటీఆర్‌ ఆరోపించారు. పాలనా వ్యవహారాల పట్ల కనీస ఇంగిత జ్ఞానం లేకుండా వీరు అవాకులు చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. రాజకీయ దురుద్దేశంతోనే పదేపదే తన పేరును చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చిల్లర ప్రయత్నాలను సహించబోనన్నారు.

AP MLC Election Result: ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజేతలు వీరే, ఆరు సీట్లను గెలుచుకున్న వైసీపీ, రెబల్స్ సాయంతో ఓ సీటును గెలుచుకున్న టీడీపీ

పిచ్చోడి చేతిలో రాయిలా

కొవిడ్‌ సమయంలో రూ.10 వేల కోట్ల టీకా కుంభకోణం జరిగిందని, రూ.వేల కోట్ల విలువ చేసే నిజాం నగల కోసమే పాత సచివాలయం కూల్చివేస్తున్నారనే తిక్క వ్యాఖ్యలు చేసి రేవంత్‌ నవ్వులపాలయ్యారని కేటీఆర్ అన్నారు. బండి పోతే బండి ఫ్రీ అంటూ సంజయ్‌ చేసిన అర్థరహిత వ్యాఖ్యలను కూడా ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. వీరిద్దరి నాయకత్వంలో కాంగ్రెస్‌, బీజేపీల పరిస్థితి పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని ఎద్దేవా చేశారు.

Paul Grant Dies: రైల్వే స్టేషన్‌లోనే కుప్పకూలిన ప్రముఖ నటుడు, బ్రెయిన్ డెడ్‌తో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన హ్యారీ పోటర్ ఫేమ్ పాల్ గ్రాంట్

ఉద్యోగాలను నిలిపేయాలన్న కుతంత్రం..

టీఎస్పీఎస్సీ అంశంలో కాంగ్రెస్‌, బీజేపీ చేస్తున్న దుష్ప్రచారాల వెనక మొత్తం ఉద్యోగాల భర్తీ ప్రక్రియనే నిలిపివేయాలనే ఒక భయంకరమైన కుట్ర ఉందని కేటీఆర్‌ అన్నారు. చదువులు పక్కన పెట్టి తమ రాజకీయాల కోసం యువత కలిసి రావాలని గతంలో చేసిన వ్యాఖ్యలు వాళ్ల కుటిల మనస్తత్వానికి అద్దం పడుతున్నాయని చెప్పారు. తలా తోక లేకుండా మాట్లాడుతున్న ఈ రెండు పార్టీల నేతల పిచ్చిమాటల ఉచ్చులో పడకుండా పోటీ పరీక్షల సన్నద్ధతపైనే దృష్టి సారించాలని యువతకు కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు. టీఎస్‌పీఎస్సీ ఇప్పటికే దిద్దుబాటు చర్యలను ప్రారంభించిందని, భవిష్యత్తులో పరీక్షలను మరింత కట్టుదిట్టంగా నిర్వహించేందుకు సిద్ధమవుతోందని తెలిపారు.

Anand Mahindra Naatu Naatu Video: నాటు నాటు ఫీవర్, ఇదే లాస్ట్ ట్వీట్ అంటూ డ్యాన్స్ వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా



సంబంధిత వార్తలు

Celebs Pay Tribute To Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్‌కు ప్రముఖుల నివాళి, గొప్ప గురువును కొల్పోయాను అన్న రాహుల్..మన్మోహన్ సేవలు చిరస్మరణీయం అన్న ఏపీ సీఎం

K Annamalai on Sandhya Theatre Incident: తెలంగాణ‌లో అన్నీ వదిలేసి సినిమావాళ్ల వెంట‌ప‌డుతున్నారు! సీఎం రేవంత్ రెడ్డిపై త‌మిళ‌నాడు బీజేపీ చీఫ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Geetha Arts Express Gratitude To TG Govt: సీఎం రేవంత్ రెడ్డికి కృత‌జ్ఞ‌త‌లు! అల్లు అర‌వింద్ నేతృత్వంలోని గీతా ఆర్ట్స్ పోస్ట్, ఇంకా ఏమ‌న్నారంటే?

Tollywood Film Industry Meet CM Revanth Reddy: ప్రభుత్వంపై నమ్మకం ఉంది...గ్లోబల్ స్థాయికి సినిమా పరిశ్రమ, ఎలక్షన్‌ రిజల్ట్‌ లాగే సినిమా రిలీజ్‌ ఫస్ట్‌డే ఉంటుందన్న నిర్మాతలు..సీఎం రేవంత్‌తో కీలక అంశాల ప్రస్తావన