Hyderabad, March 24: తెలుగురాష్ట్రాల్లో (Telugu States) మరోసారి వరణుడు ప్రతాపం చూపించనున్నాడు. తెలంగాణ (Telangana), ఏపీలో (AP) రానున్న రోజుల్లో వానలు ముంచెత్తనున్నాయి. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నేడు, రేపు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడే వడగళ్ల వర్షం పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. కాగా, పెద్దపల్లి, కుమురంభీం ఆసిఫాబాద్, కరీంనగర్ జిల్లాల్లో నిన్న ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. అకాల వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లోని పంటలు దెబ్బ తిన్నాయి.
ఏపీలో ఇలా..
ఆంధ్రప్రదేశ్‌లో ఉరుములు , మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు వచ్చే ఐదు రోజుల పాటు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది తేలికపాటి వర్షాలు వచ్చే ఐదు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉన్నందున పంటల సాగును నిలిపివేయాలని IMD రైతులను కోరింది. తమిళనాడు, పుదుచ్చేరిలో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఉండే అవకాశం ఉంది.
హైదరాబాద్ లో అలర్ట్
నగరవాసులకు హైదరాబాద్ వాతావారణ శాఖ (Meteorological Department) అలర్ట్ జారీ చేసింది. రానున్న రెండు రోజుల్లో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. ఈనెల 24, 25 తేదీల్లో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశాలు (Rain alert) ఉన్నట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్ మహా నగరంలోని ఆరు జోన్‌లకు వాతావరణ శాఖ హెచ్చరీకలు జారీ చేసింది. నగరంలోని ముఖ్యప్రాంతాలైన చార్మినార్, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, ఎల్‌బీ నగర్, సికింద్రాబాద్, శెరిలింగంపల్లిలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ (Yellow alert) జారీ చేసింది. ఈ రెండు రోజుల్లో నగరంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.