Liquor in Telangana: తెలంగాణలో మందుబాబుల చిత్రాలు, డ్యాన్సుతో అదరగొట్టిన మద్యం ప్రియుడు, క్యూ కట్టిన మహిళలు, వైన్ షాపుల ముందు చెప్పులతో క్యూ

రాష్ట్రంలో 2200 పైచిలుకు మద్యం దుకాణాలుంటే అందులో కంటైన్మెంట్‌ జోన్లలో ఉన్న 15 దుకాణాలు తప్ప మిగిలినవన్నీ తెరుస్తామని తెలిపారు. జిల్లాలో ఉన్న అన్ని మద్యం దుకాణాల ముందు మద్యం ప్రియులు బారులు తీరారు.

Image used for representational purpose only. | (Photo-GETTY)

Hyderabad, May 6: కంటైన్మెంట్‌ జోన్లలో ఉన్న 15 దుకాణాలు తప్ప రాష్ట్రంలోని మిగతా మద్యం షాపులన్నీ (Liquor in Telangana) బుధవారం నుంచి తెరుస్తామని సీఎం కేసీఆర్‌ (TS CM KCR) తెలిపిన సంగతి విదితమే. రాష్ట్రంలో 2200 పైచిలుకు మద్యం దుకాణాలుంటే అందులో కంటైన్మెంట్‌ జోన్లలో ఉన్న 15 దుకాణాలు తప్ప మిగిలినవన్నీ తెరుస్తామని తెలిపారు. జిల్లాలో ఉన్న అన్ని మద్యం దుకాణాల ముందు మద్యం ప్రియులు బారులు తీరారు. నో మాస్క్, నో లిక్కర్, నేటి నుంచి తెలంగాణలో మద్యం అమ్మకాలు, మే 29 వరకు లాక్ డౌన్ పొడిగింపు, హైకోర్టు నిబంధనల మేరకు టెన్త్‌ పరీక్షలు, కరోనాతో కలిసి జీవించాల్సిందేనన్న తెలంగాణ సీఎం కేసీఆర్

దీంతో పోలీసులు, మద్యం దుకాణాల (Liquor shops) నిర్వాహకులు వైన్స్‌ల ముందు జనాలు సామాజిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొన్ని చోట్ల బారికేడ్లు ఏర్పాటు చేసారు. ముఖ్యంగా నగరంలోని పలు వైన్స్‌ల ముందు తెల్లవారుజామునే మద్యం ప్రియులు వచ్చి లైన్లు కట్టేసారు.

బార్లు, పబ్బులు, క్లబ్‌లకు మాత్రం అనుమతి నిరాకరించారు. అలాగే మద్యం (Wines) ధరలను గరిష్ఠంగా 16 శాతం వరకు పెంచుతున్నామని, పేదలు ఎక్కువగా వినియోగించే చీప్‌ లిక్కర్‌పై 11 శాతం, ధనికులు ఎక్కువగా వినియోగించే ఇతర రకాల మద్యంపై 16 శాతం పెంపు ఉంటుందని వెల్లడించారు. మద్యం దుకాణాలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంటాయని సీఎం కేసీఆర్ తెలిపారు.

Here's Video

ఇక రాష్ట్రంలోని పలు మద్యం దుకాణాల ముందు చెప్పులు క్యూ కట్టాయి. వేసవి తాపాన్ని తట్టుకోలేక చాలా చోట్ల మందుబాబులు తమ నోరు తడుపుకోడానికి తమ చెప్పులను ఇలా క్యూలో ఉంచి ఎండ నుండి తమను తాము కాపాడుకుంటున్నారు. సామాజిక దూరం కోసం ఏర్పాటు చేసిన మార్కింగ్‌లలో తమ చెప్పులను ఉంచి నీడకు వెళ్ళి మందుబాబులు కూర్చుంటున్నారు.

Here's Video

అలాగే హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని పలు మద్యం దుకాణాల దగ్గర పరిస్థితిని సీపీ అంజనీ కుమార్‌ పరిశీలించారు. ప్రభుత్వ ఆదేశాలతో మద్యం షాపులు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌లో దాదాపు 178 మద్యం దుకాణాలు ఉన్నాయి. ప్రతి మద్యం షాపు దగ్గర భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్నాం. కంటైన్మెంట్‌ ప్రాంతాల్లో పటిష్ట చర్యలు తీసుకున్నాం. ఈ నెల 29 వరకు లాక్‌డౌన్‌ అమలు చేస్తాం. ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని సీపీ కోరారు.

Women queue up in front of wine shops in kondapur

ఇదిలా ఉంటే కొండాపూర్‌లోని ఓ వైన్స్‌ ముందు మందుబాబులకు పోటీగా అమ్మాయిలు కూడా ఉదయాన్నే వచ్చి లైన్‌లో నిల్చున్నారు. సామాజిక దూరం పాటిస్తూనే మొహాలకు మాస్కులతో అమ్మాయిలు మందు కోసం పడిగాపులు కాస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌ నగరంలోని కొండాపూర్‌, పంజాగుట్ట, మాదాపూర్‌ లలో వైన్‌ షాపుల ముందు మహిళలు క్యూ నిల్చున్న దృశ్యాలు కనిపించారు. మరి కొన్ని చోట్ల వృద్ధ మహిళలు మద్యం కోసం వైన్‌ షాపుల వద్దకు వచ్చారు.

మేడ్చల్ ఎక్సైజ్ పరిధిలోని వైన్ షాపుల‌ ముందు సామాజిక దూరం కోసం సిబ్బంది రింగ్ మార్కులు‌ వేస్తోంది. మద్యం అమ్మకాల కోసం లిక్కర్ షాపు యజమానులు, అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఇక అక్కడ మద్యం ప్రియులు షాపులు తెరుచుకోవడంతో డ్యాన్సులు వేస్తున్నారు. అయితే కొంతమంది ఫుల్లుగా తాగి ఇంట్లో వారితో గొడవకు దిగుతున్నారు. నగరంలోని బాలా నగర్‌కు చెందిన ప్రసాద్ అనే వ్యక్తి పూటుగా తాగి భార్యతో వాగ్వాదానికి దిగాడు. లాక్‌డౌన్ సమయంలో ఎందుకు కొన్నావని భార్య అడిగితే.. తాగిన మైకంలో ఉన్న ప్రసాద్ ఏకంగా బ్లేడుతో శరీరంపై కోసుకోవడం మొదలుపెట్టాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ... అక్కడికి చేరుకుని భార్యాభర్తల గొడవను సర్దుబాటు చేశారు. అతన్ని ఆసుపత్రికి తరలించారు.