Warangal Shocker: ప్రేమ,పెళ్లి పేరుతో యువతితో సహజీవనం, పెళ్లి చేసుకోమంటే పరువు పోతుందని దాటవేశాడు, పెళ్లి చేసుకోవాలని ప్రియుడి ఇంటి ముందు దీక్షకు దిగిన బాధిత యువతి, వరంగల్ జిల్లాలో ఘటన
వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లిలో శనివారం చోటుచేసుకుంది.
Warangal, July 4: ప్రేమ, పెళ్లి పేరుతో వాడుకుని మోసం చేశాడని (man cheated Young Woman) ఆరోపిస్తూ యువతి ప్రియుడి ఇంటి ఎదుట దీక్షకు దిగింది. వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లిలో శనివారం చోటుచేసుకుంది. బాధిత యువతి తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పరపల్లికి చెందిన ఆరెళ్లి కిరణ్ ప్రైవేట్ ఉద్యోగి.. అతడి సోదరుడు వరంగల్ కీర్తినగర్ కాలనీలో నివాసం ఉంటుండగా, అదే కాలనీకి చెందిన కుక్కముడి పవిత్రతో కిరణ్‌కు ఐదేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా (Love) మారడంతో అతడు పని చేసే ములుగు, మిర్యాలకూడ, వరంగల్, హన్మకొండతో పాటు పలు ప్రాంతాల్లో ఆ యువతితో కలిసి సహజీవనం (Symbiosis) చేశారు.
ఈ క్రమంలో పెళ్లి (Marriage) చేసుకోవాలని పవిత్ర కిరణ్‌ను కోరడంతో కులాలు వేరని, నిన్ను పెళ్లి చేసుకుంటే ఊళ్లో పరువు పోతుందని, మా అమ్మానాన్న చనిపోతామని అంటున్నారని పెళ్లిని దాటవేశాడు. దీంతో మోసపోయినట్లు తెలుసుకున్న పవిత్ర ఉప్పరపల్లిలోని కిరణ్ ఇంటి ఎదుట పెళ్లి చేసుకోవాలని దీక్షకు దిగింది.
కాగా, యువతి దీక్షకు ఎంఎస్‌ఎఫ్ ఇన్‌చార్జ్ రాజశేఖర్ మద్దతు తెలిపారు. పెళ్లి పేరుతో మోసం చేసిన కిరణ్‌తో పాటు ఆయన తల్లిదండ్రులు, అన్నా, వదినపై అట్రాసిటి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పవిత్రకు న్యాయం జరిగే వరకు ఎమ్మార్సీఎస్, ఎంఎస్‌ఎఫ్ సంఘాలు మద్దతుగా ఉంటాయని అన్నారు.