Telangana: పాత కక్షలతో ముగ్గురిని కాల్చిన ఎంఐఎం నేత, అదిలాబాద్ జిల్లా తాటిగూడలో వీరంగం సృష్టించిన ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఫారుక్ అహ్మద్, అరెస్ట్ చేసిన పోలీసులు
జిల్లా కేంద్రంలోని తాటిగూడలో ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఫారుక్ తాటిగూడకు చెందిన సయ్యద్ మన్నాన్, సయ్యద్ జమీర్, సయ్యద్ మోతిషాంపై దాడి చేసి లైసెన్స్ పిస్తోలతో కాల్పులు జరిపాడు.
Adialbad, Dec 19: అదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఎంఐఎం నేత, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఫారూఖ్ అహ్మద్ (MIM leader Farooq Ahmed) వీరంగం సృష్టించాడు. జిల్లా కేంద్రంలోని తాటిగూడలో ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఫారుక్ తాటిగూడకు చెందిన సయ్యద్ మన్నాన్, సయ్యద్ జమీర్, సయ్యద్ మోతిషాంపై దాడి చేసి లైసెన్స్ పిస్తోలతో కాల్పులు జరిపాడు.
ఈ దాడిలో సయ్యద్ జమీర్ కడుపు, వీపులో బుల్లెట్లు (MIM Ex Councillor Farooq Ahmed Firing)దూసుకుపోయాయి. మోతి శ్యాం కడుపు కిందిభాగంలో బుల్లెట్ దిగింది. మన్నాన్ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన చికిత్స నిమిత్తం రిమ్స్ కు తరలించారు. రిమ్స్‌లో చికిత్స పొందుతున్న బాధితులను ఎమ్మెల్యే జోగురామన్న పరామర్శించారు. ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన చికిత్సకు వైద్యులను ఆదేశించారు.
దాడి సమాచారాన్ని తెలుసుకున్న టూటౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, క్షతగాత్రులను రిమ్స్ దవాఖానకు తరలించారు. ఫారూఖ్‌ను అదుపులోకి తీసుకొని కత్తి, రివాల్వర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఫారూఖ్‌పై ఐపీసీ 307, భారత ఆయుధాల చట్టం 27/30 కేసు నమోదు చేసి, నిందితుడిని జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్టు ఓఎస్డీ రాజేశ్ చంద్ర తెలిపారు. బుల్లెట్ గాయాలైన ఇద్దరిని హైదరాబాద్‌కు తరలించారు. దవాఖానలో చికిత్స పొందుతున్న వారిని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, జెడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ పరామర్శించారు.
గతంలో జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో ఓటమిపాలైన ఫారుఖ్ అహ్మద్.. తన ఓటమికి కారకులైన వారిపై పగతోనే ఈ ప్రతీకార దాడికి పాల్పడినట్టు (MIM leader in Telangana) బాధితులు ఆరోపిస్తున్నారు. ఫారుఖ్ అహ్మద్ ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాకు ఏఐఎంఐఎం పార్టీ ( AIMIM party ) జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు.
ఈ ఘటనపై జిల్లా ఓఎస్‌డీ రాజేశ్‌చంద్ర విలేకరులతో మాట్లాడుతూ ఫారూఖ్ అహ్మద్ 0.32 ఎంఎం పిస్టల్‌తో మూడు రౌండ్లు కాల్పులు జరిపాడని, జమీర్‌కు రెండు బుల్లెట్‌లు, మోతిషీమ్‌కు ఒక బుల్లెట్ తగిలిందన్నారు. నిందితుడు ఫారూఖ్ అహ్మద్‌పై ఐపీసీ 307 సెక్షన్ కింద కేసు నమోదు చేసి కస్టడీలోకి తీసుకొని రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు.
అదిలా బాద్ జిల్లా కేంద్రంలోని తాటిగూడ కాలనీలో నివసించే ఫారూఖ్ అహ్మద్ కుమారుడు, అదే కాలనీలో నివసించే సయ్యద్ మన్నన్ కుమారుడు మోతిషీమ్ శుక్రవారం సాయంత్రం క్రికెట్ ఆడే క్రమంలో గొడవపడ్డారు. ఇటీవలి మున్సిపల్ ఎన్నికల్లో తాటిగూడ వార్డు మహిళకు రిజర్వ్‌కాగా ఫారూఖ్ అహ్మద్ భార్య ఎంఐఎం నుంచి, సయ్యద్ మన్నన్ బంధువు టీఆర్‌ఎస్ నుంచి బరిలో నిలిచారు. అప్పటి నుంచి వారి మధ్య రాజకీయ విభేదాలు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో తమ పిల్లలు క్రికెట్ ఆడుతూ గొడవ పడటంతో ఇరు కుటుంబాల వారు పరస్పరం ఘర్షణకు దిగారు. ఈ సమయంలో ఫారూఖ్ అహ్మద్ రివాల్వర్, తల్వార్‌తో దాడికి దిగాడు. సయ్యద్ మన్నన్‌పై తల్వార్‌తో దాడి చేయడంతో ఆయన తలకు గాయాలయ్యాయి. ఆ తర్వాత చేతిలో ఉన్న రివాల్వర్‌తో కాల్పులు జరపగా సయ్యద్ మన్నన్‌కు మద్దతుగా వచ్చిన ఆయన సోదరుడు సయ్యద్ జమీర్, మోతిషీమ్‌లకు బుల్లెట్ గాయాలయ్యాయి.