Sexual Harassment. Representational Image | (Photo Credits: PTI)

Bhadradri Kothagudem, Dec 17: తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉపాధ్యాయుడే కామాంధుడిగా (Sexual harassment in TS) మారాడు. అభం శుభం తెలియన చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన పాఠశాలలో ఈ ఘాతుకానికి (Sexual harassment) పాల్పడ్డాడు. దారుణ ఘటన వివరాల్లోకెళితే.. భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలోని లక్ష్మీదేవిపల్లి మండలం మైలారం పంచాయతీ పరిధిలోని చింతవర్రె మండల పరిషత్ పాఠశాల హెడ్మాస్టర్ గా సునీల్ కుమార్ పనిచేస్తున్నారు.

పాఠశాలలో కేవలం 11 మంది విద్యార్థులుండగా వారిలో ఐదుగురు బాలికలు ఉన్నారు. చిన్నారులపై కన్నేసిన ఉపాధ్యాయడు పాఠశాల లేకపోయినా తరగతుల పేరుతో వారిని రప్పించి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. లైంగిక దాడి చేసిన తర్వాత ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించడంతో భయపడి బాలికలు మిన్నకుండిపోయారు.

అత్యాచారానికి గురైన బాలిక ఆరోగ్యం బాలేదని ఆమె తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లడంతో ఈ దారుణం బయటపడింది. ఆమెపై లైంగికదాడి జరిగినట్లు తెలియడం..మరికొందరు విద్యార్థినులు కూడా బయటకు రావడంతో పేరెంట్స్‌ హెడ్మాస్టర్‌ని నిలదీశారు. ఆగ్రహంతో గ్రామస్తులు కీచక హెడ్మాస్టర్‌ని చితకబాదారు. విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు, తహసీల్దార్, ఎంపీడీవో, సీడీపీవో తదితరులు గ్రామానికి చేరుకుని వివరాలు సేకరించారు.

Here's ANI Update

చిన్నారుల తల్లిదండ్రులు, గ్రామస్తులతో చర్చించారు. హెడ్మాస్టర్ సునీల్‌కుమార్‌ని తక్షణం సస్పెండ్ చేస్తున్నట్లు డీఈవో సోమశేఖరశర్మ ప్రకటించారు. ఆస్పత్రి పాలైన బాధిత బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కీచకుడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు (Teacher arrested for allegedly sexually harassing) చేసి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.