GHMC Draft Budget: జీహెచ్ఎంసీ ముసాయిదా బడ్జెట్ 2021–22కి ఆమోదం, మొత్తం రూ. 5600 కోట్లతో ముసాయిదా బడ్జెట్, స్టాండింగ్ కమిటీ సభ్యులకు ఐఫోన్లపై కొనసాగుతున్న సస్పెన్స్

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ రాబోయే ఆర్థిక సంవత్సరానికి (2021–22) సంబంధించి గత నెలలో రూ. 5600 కోట్లతో ప్రవేశపెట్టిన ముసాయిదా బడ్జెట్‌ను (GHMC Draft Budget) జీహెచ్‌ఎంసీ స్టాండింగ్‌ కమిటీ (GHMC Standing committee) ఎలాంటి మార్పుచేర్పుల్లేకుండా యథాతథంగా ఆమోదించింది.

GHMC Draft Budget: జీహెచ్ఎంసీ ముసాయిదా బడ్జెట్ 2021–22కి ఆమోదం, మొత్తం రూ. 5600 కోట్లతో ముసాయిదా బడ్జెట్, స్టాండింగ్ కమిటీ సభ్యులకు ఐఫోన్లపై కొనసాగుతున్న సస్పెన్స్
GHMC Mayor Bontu Rammohan (Photo-Twitter)

Hyderabad, Dec 18: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ రాబోయే ఆర్థిక సంవత్సరానికి (2021–22) సంబంధించి గత నెలలో రూ. 5600 కోట్లతో ప్రవేశపెట్టిన ముసాయిదా బడ్జెట్‌ను (GHMC Draft Budget) జీహెచ్‌ఎంసీ స్టాండింగ్‌ కమిటీ (GHMC Standing committee) ఎలాంటి మార్పుచేర్పుల్లేకుండా యథాతథంగా ఆమోదించింది. ఈ మేరకు జీహెచ్‌ఎంసీకి వచ్చే ఆదాయంలో అత్యధికంగా 32 శాతం ఆస్తిపన్ను ద్వారా రూ. 1850 కోట్లు వస్తుందని అంచనా వేస్తున్నారు. జీహెచ్ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ (Mayor Bontu Rammohan) అధ్యక్షతన గురువారం జరిగిన స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో ముసాయిదా బడ్జెట్‌ను ఆమోదించారు. వీటిలో కొన్ని ముఖ్యాంశాలను కమిటీ ప్రస్తావించింది.

ఇదిలా ఉంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ సభ్యులకు ఐఫోన్‌లు కొనివ్వాలని నిర్ణయం తీసుకున్న సంగతి విదితమే. దీనిపై జీవో కూడా ఇచ్చింది. రూ. లక్షా 60వేల విలువైన ఐఫోన్-12 మ్యాక్స్ ప్రో ఫోన్లను బహుమతిగా ఇవ్వాలని జీహెచ్ఎంసీ నిర్ణయం తీసుకుని ఆదేశాలు జారీ చేసింది.

స్పెషల్ క్లాసులంటూ చిన్నారులపై లైంగిక దాడి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉపాధ్యాయుడి ఘాతుకం, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

15 మంది స్టాండింగ్‌ కమిటీ సభ్యులతోపాటు మేయర్, డిప్యూటీ మేయర్‌ సహా మొత్తం 17 ఆపిల్‌ ఐఫోన్ల (ప్రో మాక్స్‌–512జీబీ) కొనుగోలుకు రూ. 27,23,740 ఖర్చు చేసేందుకు స్టాండింగ్‌ కమిటీ ఎజెండాలో ఉంచారు. ఇందుకోసం బడ్జెట్ కూడా కేటాయించింది. అయితే ప్రస్తుతం ఫోన్లు మార్కెట్‌లో అందుబాటులో లేనందున వాయిదా వేశారనే ప్రచారం చేశారు. కానీ విశ్వసనీయ సమాచారం మేరకు ఆమోదం పొందినట్లేనని తెలుస్తోంది.

బల్దియా ముసాయిదా బడ్జెట్‌ను స్టాండింగ్‌ కమిటీ ఆమోదించిన నేపథ్యంలో ప్రధాన అంశాలు ఇలా ఉన్నాయి.

1. నాగోల్‌లోని ఫతుల్లాగూడలో 6.20 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్న శ్మశానవాటికల్లో హిందూ, ముస్లిం, క్రిస్టియన్లకు రెండెకరాల చొప్పున శ్మశానవాటికలు. హిందువులకు విద్యుత్‌ దహనవాటిక.

2. జీహెచ్‌ఎంసీ అధికారుకు పోస్ట్‌ పెయిడ్‌ 4జీ జీఎస్‌ఎం వాయిస్‌ అండ్‌ డేటా సిమ్‌లు.

3. కాప్రా సర్కిల్‌లో మూడు వరద కాల్వల నిర్మాణానికి రూ.3.60 కోట్లతో టెండర్లు

4. మూడు ప్రాపర్టీ టాక్స్‌ ఇండెక్స్‌ నంబర్ల రద్దు.

5. వివిధ మార్గాల్లో రహదారుల విస్తరణకు ఆస్తుల సేకరణ

6. మొత్తం 18 అంశాలను ఆమోదించినట్లు పేర్కొన్న జీహెచ్‌ఎంసీ కొన్నింటిని మాత్రం అధికారికంగా వెల్లడించలేదు.

ఆదాయం ఇలా..

7. 22 శాతం నిధులు రూ. 1224.51 కోట్లు రుణాల ద్వారా తీసుకోనున్నారు. 17 శాతం నిధులు రూ. 1022.70 కోట్లు ఫీజులు, యూజర్‌ చార్జీల కింద రానున్నాయి

8. 14 శాతం నిధులు రూ. 770.51 కోట్లు ప్లాన్‌ గ్రాంట్ల కింద రానున్నాయి

9. 13 శాతం నిధులు రూ. 652.10 కోట్లు అసైన్డ్‌ రెవెన్యూ కింద రానున్నాయి

10. 3 శాతం నిధులు రూ. 189.69 కోట్లు క్రమబద్ధీకరణ ఫీజుల కింద లభించనున్నాయి

11. ఒక శాతం నిధులు రూ. 66.20 కోట్లు ఇతర రెవెన్యూ మార్గాల ద్వారా లభించనున్నాయి

12. రూ. 22.84 కోట్లు కాంట్రిబూషన్‌ ద్వారా అందుతాయని అంచనా

(The above story first appeared on LatestLY on Dec 18, 2020 04:55 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).