Motkupalli Narasimhulu: దళితుడు ఇంట్లోకి వస్తే గోమూత్రంతో శుద్ధి చేసుకునే రకం.. కేసీఆర్‌పై మోత్కుపల్లి సంచలన వ్యాఖ్యలు.. ఆరు నెలలుగా అపాయింట్‌ మెంట్ ఇవ్వకుండా కేసీఆర్ అవమానిస్తున్నారని ఆవేదన

దళితుడు ఇంట్లోకి వస్తే గోమూత్రంతో శుద్ధి చేసుకునే రకం కేసీఆర్‌ అని బీఆర్ఎస్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు సంచలన వ్యాఖ్యలు చేశారు.

Motkupalli Narasimhulu

Hyderabad, Sep 25: దళితుడు ఇంట్లోకి వస్తే గోమూత్రంతో శుద్ధి చేసుకునే రకం కేసీఆర్‌ (KCR) అని బీఆర్ఎస్ (BRS) నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు (Motkupalli Narasimhulu) సంచలన వ్యాఖ్యలు చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన నిరసనదీక్ష చేపట్టారు. టీడీపీ నేతలు సహా పలువురు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మోత్కుపల్లి మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. ‘ఎన్టీఆర్, చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రులుగా ఉండగా నేరుగా వారి వద్దకు వెళ్లేవాడిని. కానీ, కేసీఆర్ మాత్రం దళితుడు ఇంట్లోకి వస్తే గోమూత్రంతో శుద్ధి చేసుకునే రకం’ అంటూ ఆయన అన్నారు.

Tollywood Drugs Case: డ్రగ్స్ కేసులో టాలీవుడ్ దర్శకుడు వాసువర్మ అరెస్ట్.. సినీ రచయిత మన్నెరి పృథ్వీకృష్ణ, ఈవెంట్ నిర్వాహకుడు రాహుల్ ఇచ్చిన సమాచారంతో వాసువర్మను అదుపులోకి తీసుకున్న పోలీసులు

30 నియోజకవర్గాలను నిర్ణయించేది వాళ్లే

తెలంగాణలోని 30 నియోజకవర్గాల్లో ఏపీ నుంచి వచ్చిన వారు గెలుపోటములను ప్రభావితం చేస్తారని, చంద్రబాబు అరెస్టుపై కేసీఆర్ స్పందించకుంటే ఆయనకే నష్టమని హెచ్చరించారు. బీఆర్ఎస్‌లోకి తనంత తానుగా వెళ్లలేదని, కేసీఆర్ పిలిస్తేనే వెళ్లానని గుర్తు మోత్కుపల్లి గుర్తు చేశారు. ఆ తర్వాత తనను దూరం పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు నెలలుగా అపాయింట్‌ మెంట్ అడుగుతున్నా ఇవ్వకుండా అవమానిస్తున్నారని అన్నారు.

TTD Special Darshan Tickets: నేటి ఉదయం 10 గంటలకు శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల.. ఏ నెల కోటా అంటే??



సంబంధిత వార్తలు