Devi Idol Vandalized: ‘తిండి దొరక్కపోవడంతోనే..’ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌ లో అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగుడు.. మీడియాకు వివ‌రాలు వెల్ల‌డించిన పోలీసులు (వీడియోతో)

హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌ లో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎగ్జిబిషన్ సొసైటీ, సిబ్బంది ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమ్మ‌వారి విగ్ర‌హాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే.

Devi Idol Vandalized (Credits: X)

Hyderabad, Oct 12: హైదరాబాద్ (Hyderabad) లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌ లో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎగ్జిబిషన్ సొసైటీ, సిబ్బంది ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమ్మ‌వారి విగ్ర‌హాన్ని (Devi Idol Vandalised) కొందరు దుండగులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో కీలక ముందడుగు పడింది. నాగర్‌ కర్నూల్‌ కి చెందిన కృష్ణయ్య గౌడ్‌ అనే వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. ఆకలిగా ఉండ‌డంతో ఆహారం కోసం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌ లోకి వ‌చ్చిన నిందితుడు.. ఆహారం దొరక్కపోవడంతో అస‌హ‌నానికి గురై మండపాన్ని చిందరవందరగా చేసి, అమ్మ‌వారి విగ్రహం ధ్వంసం చేసినట్టు వెల్లడించారు. అతని మానసిక పరిస్థితి సరిగ్గా లేదని, డిప్రెషన్‌ లో ఉన్నాడని పేర్కొన్నారు.

గూడ్స్ రైలుని ఢీకొన్న భాగమతి ఎక్స్‌ ప్రెస్.. పట్టాలుతప్పిన 12 కోచ్ లు.. చెలరేగిన మంటలు.. 19 మందికి గాయాలు .. తమిళనాడులో ఘటన (వీడియోతో)

Here's Video:

అసలేమైంది?

నాంపల్లి గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన దేవి విగ్రహం ఎదుట శనివారం రాత్రి దాండియా కార్య‌క్ర‌మం నిర్వహించారు. ఇది పూర్తయ్యే వరకూ ఎక్సిబిషన్ గ్రౌండ్స్‌ లోనే పోలీసులు గస్తీ నిర్వహించారు. అయితే, అర్థ‌రాత్రి ఎవ‌రూ లేని స‌మ‌యంలో గుర్తు తెలియ‌ని దుండగుడు  తమ అకృత్యాన్ని ప్రదర్శించాడు. వేదిక దగ్గర కరెంట్ కట్ చేసి, సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, అమ్మ‌వారి విగ్రహం చేతిని విరగ్గొట్టాడు. సమాచారం అందుకున్న బేగంబజార్ పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకొని కేసు నమోదు చేశారు.

బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారనున్న ఉపరితల ఆవర్తనం, రానున్న మూడు రోజుల పాటు తెలంగాణకు వర్ష సూచన, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ