Hyderabad, Oct 19: ఆందోళన కలిగించేలా ఆలయాల ధ్వంసరచన (Temples Vandalized) కొనసాగుతున్నది. హైదరాబాద్ లో మరో ఆలయాన్ని ఓ దుండగుడు ధ్వంసం చేశాడు. మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బడంగ్ పేట్ లో ఈ ఘటన జరిగింది. అర్థరాత్రి సమయంలో పోచమ్మ తల్లి (Pochamma Temple Vandalized) ఆలయంలో శిఖరాన్ని ధ్వంసం చేసిన సదరు దుండగుడు హుండీలో ఉన్న డబ్బులను చోరీ చేసేందుకు యత్నించాడు.
Here's Video:
హైదరాబాద్ లో మరో ఆలయంలోని విగ్రహం ధ్వంసం..
మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బడంగ్ పేట్ లో ఘటన
అర్థరాత్రి పోచమ్మ తల్లి ఆలయంలో శిఖరాన్ని ధ్వంసం చేసి హుండీలో ఉన్న డబ్బులను చోరీ చేసేందుకు యువకుడి యత్నం
యువకుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించిన స్థానికులు@RachakondaCop#Hyderabad… pic.twitter.com/9K7x2t6WYN
— BIG TV Breaking News (@bigtvtelugu) October 19, 2024
చప్పుడు రావడంతో..
అయితే, ఆలయంలో నుంచి చప్పుడు పెద్దయెత్తున రావడంతో స్థానికులు ఏమిటా? అని ఆరా తీశారు. ఆలయంలో దారుణానికి పాల్పడుతున్న యువకుడిని పట్టుకుని చితకబాదారు. పోలీసులకు సమాచారం అందించి నిందితుడిని అప్పగించారు.